Advertisementt

మురుగదాస్‌ ట్వీట్‌తో మహేష్‌ ఫ్యాన్స్ హ్యాపీ!

Thu 05th Jan 2017 11:15 AM
mahesh babu,ar murugadoss,mahesh babu fans,ar murugadoss twit  మురుగదాస్‌ ట్వీట్‌తో మహేష్‌ ఫ్యాన్స్ హ్యాపీ!
మురుగదాస్‌ ట్వీట్‌తో మహేష్‌ ఫ్యాన్స్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 100కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాన్ని ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రానికి 'వాస్కోడిగామా, ఎనిమీ, ఏజెంటు శివ, ఏజెంట్‌ 007, అభిమన్యు' వంటి పలు టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రానికి ఎట్టకేలకు 'సంభవామి' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని, ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూడా ఈ టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించారని వార్తలు వచ్చినా దీనిపై కూడా అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి1న విడుదల చేస్తామని ప్రకటించిన యూనిట్‌ ఆ తేదీన టైటిల్‌ను అనౌన్స్‌ చేయకపోవడంతో మహేష్‌ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా దర్శకుడు మురుగదాస్‌ ఈ చిత్ర యూనిట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో 'బ్లాక్‌బస్టర్‌ ఆన్‌ ది వే' అని రాయడంతో మహేష్‌ అభిమానులు సంబరపడుతున్నారు. చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌లు ఎప్పుడు విడుదలవుతాయా? అని కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ రేసులో రిలీజ్‌ కానుంది. మొత్తానికి ప్రస్తుతానికి దర్శకుడి ట్వీట్‌తో మురిసిపోతున్న ప్రిన్స్‌ ఫ్యాన్స్‌కు ఆ తీపివార్త ఎప్పుడు అందుతుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ