Advertisementt

ఈ హీరోయిన్ కి పిల్లల్ని కనాలని ఉందట..!

Thu 05th Jan 2017 10:55 AM
heroine,kangana ranaut,kangana waiting for marriage,kangana ranut desire,kangana movies  ఈ హీరోయిన్ కి పిల్లల్ని కనాలని ఉందట..!
ఈ హీరోయిన్ కి పిల్లల్ని కనాలని ఉందట..!
Advertisement
Ads by CJ

ఎప్పటికప్పుడు తన మాటలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ హీరోయిన్‌గా కంగనారౌనత్‌కు పేరుంది. ఇటీవల ఆమె రోజుకో ఇంటర్వ్యూలో ఒక్కో సెన్సేషన్‌ వార్తలను చెబుతూ తన మీదే చర్చ జరిగేలా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నిన్నకాక మొన్న తాను ఓ నీలిచిత్రంలాంటి సినిమాలో నటించబోయానని తెలిపింది. తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ, నా వయసు 30 ఏళ్లు. నాకు కొత్తగా పిల్లలను కనాలని, అమ్మా అనిపించుకొని, మాతృత్వాన్ని ఆస్వాదించాలనే కోరికలు పెరుగుతున్నాయి అని చెప్పింది. మీడియా వారు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా....! అని అడిగితే కాస్త ఖంగుతిన్న ఆమె.. నిజమే... అందుకే త్వరలో నాకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొని తొందరగా తల్లిని అవుతానని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె మూడు లేడీ ఓరియంటెడ్‌, భారీ చిత్రాలలో నటించనుంది. ఆమె కెరీర్‌ ప్రస్తుతం పీక్‌ స్టేజీలో ఉంది. తాను డిమాండ్‌ చేసినంత నిర్మాతలు, దర్శకులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో చిత్రానికి 15కోట్లకు పైగానే తీసుకుంటూ, దీపికాపడుకోనే, ప్రియాంకాచోప్రాలు లేని లోటును తీరుస్తూ బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ స్టార్‌హీరోయిన్‌గా హవా సాగిస్తోంది. మొత్తానికి ఇలాంటి సమయంలో ఇలాంటి డేరింగ్‌ నిర్ణయం తీసుకోవడం ఆమెకే సాధ్యమంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. దీంతో ఇతర బాలీవుడ్‌ హీరోయిన్లు ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకొని, తల్లి అవుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ఆ స్థానం తమకు లభిస్తుందని ఆశిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ