సెక్సీ తారగా, అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని నటిగా సెక్స్‌బాంబ్ రాయ్‌లక్ష్మీ(లక్ష్మీరాయ్)కి మంచి పేరుంది. కానీ హీరోయిన్‌గా మాత్రం ఆమె కేవలం మీడియం హీరోలకే పరిమితమయింది. అవి కూడా విజయం సాధించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఒకానొక్క సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలని కూడా భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఐటం సాంగ్స్‌కు కూడా ఓకే చెబుతూ వస్తోంది ఈమె. కాగా ఈమె ఆమధ్య పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రంలో కూడా ఓ ఐటంలో చిందులేసింది. కానీ ఈ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలు ఆవిరైపోయాయి. ఇలాంటి సమయంలో ఆమెపై మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత చరణ్, దర్శకుడు వినాయక్‌ల దృష్టి పడింది. దీంతో చిరు నటిస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెంబర్150'లో ఆమెకు ఓ ఐటం సాంగ్‌లో, అందునా చిరు వంటి డ్యాన్సింగ్ సెన్సేషన్ పక్కన స్టెప్స్ వేసే అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందునా ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ లారెన్స్ కంపోజ్ చేయడం తన అదృష్టంగా ఫీలయింది. ఈమెతో చిరు నర్తించిన 'రత్తాలు.. రత్తాలు' ఐటం నెంబర్ ప్రస్తుతం వీరలెవల్లో హల్‌చల్ చేస్తోంది. కొద్ది పాటి మేకింగ్ వీడియోలోనే ఆమె అందాలను ఆరబోసిన విధానం, ఆమె స్టెప్స్ వేసిన తీరు చూసి ఆమెను మెగాఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ పాటతో ఆమె దశ తిరగడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. దీనిపై ఈ స్పెషల్ లేడీ స్పందించింది. తనకు అవకాశం ఇచ్చిన చిరు, చరణ్, వినాయక్, లారెన్స్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు.. ఈమె మెగాహీరోలను ఆకట్టుకోవడం కోసం మరో ఎత్తుగడ వేసింది. ఈ పాటలో తాను అంత అందంగా కనిపించడానికి స్టైలిస్ట్‌గా పనిచేసిన చిరు కుమార్తె సుస్మిత కొణిదెలకు ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో మెగాభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ సినిమా హిట్టయితే ఇక వరుస అవకాశాలు అందునా మిగిలిన మెగాహీరోల చూపు ఆమెపై పడుతుందని, దాంతో ఆమెకు ఇక ఐటంగర్ల్‌గా తిరుగేలేదంటున్నారు మెగాభిమానులు, మరి పవన్ ఇవ్వలేని బ్రేక్ చిరు ఇస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే ఈనెల 11 వరకు వెయిట్ చేయాలి.