27ఏళ్ల సెక్సీ సుందరి శ్రద్దాకపూర్ 45ఏళ్ల వయసు, ఆల్‌రెడీ ఇద్దరు పిల్లలున్న దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో ప్రేమాయణం నడుపుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారం శ్రద్దాకపూర్ తండ్రి, సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తికపూర్‌కు అసలు నచ్చడం లేదు. ప్రస్తుతం ఒంటిరిగా ఉంటోన్న ఫర్హాన్ అక్తర్ ఇంట్లోకి శ్రద్దా తన సామాన్లతో సహా దిగిపోయిందట. ఆయనతో సహజీవనం కోసం వెంపర్లాడుతున్న ఆమె ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుందని బిటౌన్ వర్గాలు అంటున్నాయి. దాంతో ఈ వ్యవహారం నచ్చని శక్తికపూర్ ఫర్హాన్ ఇంటికి వెళ్లి ఆయనపై చేయి చేసుకొని, తన కూతురును కూడా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేసి తీసుకొచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ విషయంపై స్పందించేందుకు శక్తికపూర్ నిరాకరించాడు. మరోవైపు శ్రద్దాకపూర్ మాట్లాడుతూ, నాకు ఇల్లుంది. నేను పుట్టి పెరిగిన ఇంటికి రాకాబోయే భర్తను నేను తీసుకురాలను. అలాగే నాకు మా అమ్మానాన్నలతో తప్పించి ఎవ్వరితోనూ ఎటువంటి లివ్ ఇన్ రిలేషన్లు లేవు. వేరే ఇంటికి వెళ్లిపోలేదు. నాకు నా సామాన్లు పెట్టుకుని మీటింగ్‌లు జరుపుకోవడానికి ఒక ఇల్లు ఉంది. ఇవి తప్పించి ఇంకేం లేవు.. అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ప్రస్తుతం ఈనెలలోనే విడుదలకు సిద్దమవుతున్న 'ఓకే జానూ' చిత్రంలో హాట్‌హాట్‌గా కనిపిస్తోంది మొత్తానికి అమ్మడి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నప్పుడు మాత్రమే ఇటు వంటి రూమర్లు రావడం అనేది ఈమధ్య కామన్‌గా మారింది. ఈ తాజా వివాదం కూడా అలాంటి రూమరేనని, తన సినిమా పబ్లిసిటీ కోసమే ఆమె అలా గాసిప్స్ లీక్ చేస్తుందంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.