Advertisementt

శ్రీదేవి స్పెషల్ కేర్ అందుకేనంట..!

Tue 03rd Jan 2017 01:25 PM
sridevi,bony kapoor,jhanvi kapoor,jhanvi kapoor cine entry,bollywood,sridevi special care  శ్రీదేవి స్పెషల్ కేర్ అందుకేనంట..!
శ్రీదేవి స్పెషల్ కేర్ అందుకేనంట..!
Advertisement
Ads by CJ

చాలా రోజుల నుండి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇదిగో సినిమా ల్లో ఎంట్రీ ఇస్తుంది అదిగో సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని ఒకటే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వార్తలపై శ్రీదేవి మాత్రం నోరు విప్పి స్పందించలేదు. కానీ జాన్వీ కపూర్ మీద చాలా రకాల న్యూస్ లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. జాన్వీ కి ఎవరో బాయ్ ఫ్రెండ్ వున్నాడని... అతనితో జాన్వీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని అబ్బో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక జాన్వీ మరొపక్కన నటనలో మెళుకువలు తెలుసుకోవడానికి విదేశాల్లో కోచింగ్ తీసుకుంటుందని... ఆమెకి తల్లిలాగే ఏవో ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. 

ఈ వార్తలు అన్నింటీని చూస్తున్న బోని కపూర్, శ్రీదేవి లు మాత్రం తమ పని తాము చేసుకుపోతూ జాన్వీ కి నటనకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నారని చెబుతున్నారు. ఏదో ఒక పేరున్న నిర్మాణ సంస్థ ద్వారా జాన్వీని హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు శ్రీదేవి, బోని కపూర్ లు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే డాన్స్ లో మెళుకువలు, ఫోటో షూట్స్ వంటివి చేపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా జాన్వీ కి సంబందించిన ఒక ఫోటో షూట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. అదేమిటంటే జాన్వీ సినిమా అరంగేట్రానికి ముందు ఇలా ఫోటో షూట్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. 

ఇక ఫోటో షూట్ కూడా సినిమాల్లో ఎంటర్ అవ్వడానికి చేయించుకుందని... అయితే జాన్వీ ఖచ్చితం గా ఒక బాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమవుతుందని అంటున్నారు. మరి బాలీవుడ్ లో ఎమన్నా తేడా వస్తే లెక్కలు తారుమారయ్యే ప్రమాదం వుంది కాబట్టే శ్రీదేవి ఇలా కూతురి గురించి స్పెషల్ కేర్ తీసుకుంటుందని ఫిలింసర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ