బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధంగా వుంది. ఇక బాలకృష్ణ 100 వ చిత్రం క్రిష్ తో చేసాడు. మరి 101 వ చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేస్తాడా అని అనుకుంటున్న సమయంలో కృష్ణవంశీ తో 'రైతు' అనే టైటిల్ తో సినిమా కూడా ఒకే అయ్యింది. ఇక ఆ సినిమా కొన్ని కారణాల వల్ల చాలా టైం తీసుకుని 2017 జూన్ లో షూటింగ్ మొదలు పెడతారని చెబుతున్నారు. మరి 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బాలకృష్ణ ఖాళీగా వున్నాడు. ఇక ఇప్పుడు 'రైతు' సినిమా మొదలు పెట్టాలన్నా చాలా టైమే పడుతుంది. మరి ఈ గ్యాప్ లో బాలయ్య ఎవరైనా డైరెక్టర్ తో కమిట్ అవుతాడా.. లేదా? అనేది అందరూ ఇప్పుడు తెగ ఆలోచిస్తున్న ప్రశ్న.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఈ మధ్యన కాలం కలిసి రాక తీసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఏదో తెలుగులో మహేష్ కి 'పోకిరి' వంటి హిట్టిచ్చి స్టార్ డైరెకర్స్ పక్కన చేరాడు కానీ లేదంటే పూరి పని ఖాళీ అయ్యుండేది. ఈ మధ్యన కళ్యాణ్ రామ్ తో 'ఇజం' తీసి డీలా పడి కూర్చున్నాడు. ఇక 'ఇజం' సినిమా అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మరో పక్క మహేష్ తో 'జనగణమన' ప్లాన్ చేసాడు... అదీ కుదరలేదు. పాపం పూరి అనుకుంటున్న సమయంలో వెంకటేష్ కి ఒక కథ వినిపించడమూ అది కాస్తా ఒకే అయినట్లు వార్తలు రావడమూ.... మరో పవర్ ఫుల్ కథని బాలకృష్ణ కి చెప్పడమూ..... ఇక బాలయ్య డెసిషన్ కోసం పూరి ఎదురు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
మరి 'గౌతమికి.... రైతు' కు మధ్యన ఉన్న గ్యాప్ లో బాలయ్య పూరి కథను ఒకే చేస్తాడా? లేక పూరితో ఎందుకులే అనుకుని సైలెంట్ అవుతాడా? అనేది తెలియాల్సి వుంది. ఇక మరోపక్క ఎలాగూ పూరి చాలా స్పీడ్ గా సినిమా చేసేస్తాడు. అందుకే 'గౌతమి.... రైతు' కు ఉన్న గ్యాప్ లో పూరితో సినిమాకి బాలకృష్ణ కమిట్ అవుతాడనే ప్రచారం జరుగుతుంది. చూద్దాం పూరీ - బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? లేదా? అనేది.