ఈ కొత్త ఏడాది అందరికి చాలా ముఖ్యమైనది. అయితే ముఖ్యంగా ముగ్గురు సౌత్‌ఇండియన్ సీనియర్‌స్టార్స్‌కు స్పెషల్ ఇయర్ కానుంది. వారి కెరీర్‌లోనే ఈ చిత్రాలు వారికి, వారి అభిమానులకు ప్రత్యేకంగా మారనున్నాయి. ఆ ముగ్గురే రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ. 9ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న 150వ చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150' రికార్డుల్లోకి ఎక్కనుంది. మరోపక్క నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా మిగలనుంది. ఇక మరో సీనియర్ స్టార్, సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న వండర్‌మూవీ '2.0' కూడా రజనీకి, ఆయన అభిమానులకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ చిత్రం రజనీకి 160 వ చిత్రం కావడం విశేషం. మొత్తానికి ఈ ఏడాది సౌత్ ఫిల్మ్‌ఇండస్ట్రీకి, మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు సీనియర్ స్టార్స్‌కు చిరకాలం గుర్తుంటుంది. ప్రస్తుతం యంగ్‌స్టార్స్ ఎవ్వరూ సెంచరీ చిత్రాలను దాటే అవకాశం కనిపించకుండా పోతున్న తరుణంలో కేవలం 25, 50, 75 వంటి చిత్రాల దగ్గరే ఆగిపోతున్న ఇతరుల విషయం పరిగణనలోకి తీసుకుంటే మరే హీరోలు భవిష్యత్తులో ఈ మైలురాళ్లను అందుకునే అవకాశం లేదనిపిస్తోంది.