Advertisementt

రజనీకాంత్ 'కబాలి2' కన్‌ఫ్యూజన్.!

Tue 03rd Jan 2017 12:24 PM
rajinikanth,kabali 2,confusion,ranjith paa  రజనీకాంత్ 'కబాలి2' కన్‌ఫ్యూజన్.!
రజనీకాంత్ 'కబాలి2' కన్‌ఫ్యూజన్.!
Advertisement
Ads by CJ

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, వాస్తవిక చిత్రాల దర్శకునిగా పేరు తెచ్చుకున్న యువదర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో రూపొందిన 'కబాలి' చిత్రానికి విడుదలకు ముందు ఏ చిత్రానికి రానంత భారీ హైప్‌ వచ్చింది. తెలుగులో ఈ చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ తమిళంతో పాటు ఇతర భాషల్లో, మలేషియా, జపాన్‌ వంటి దేశాల్లో మాత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం 200కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాత కలైపులిథానుకు భారీ లాభాలను ఆర్జించిపెట్టింది. కాగా ఈ చిత్ర నిర్మాత కలైపులి థాను తాను 'కబాలి-2' చిత్రాన్ని తీస్తానని, ఈ చిత్రానికి కూడా రంజిత్‌ పా దర్శకత్వం వహిస్తాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మాతగా తన మామ రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌పా దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఈ ధనుష్‌ నిర్మించే చిత్రమే 'కబాలి2' అని భావించారు. కానీ ఇటీవల ఈ చిత్ర దర్శకుడు రంజిత్‌పా మాట్లాడుతూ, ఈ చిత్రం 'కబాలి2' కాదని, ఇది ఓ ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతుందని ప్రకటించాడు. అదే నిజమైతే మరి కళైపులి థాను, రంజిత్‌పా దర్శకత్వంలో రూపొందే 'కబాలి2' చిత్రం నిజంగానే సెట్స్‌పైకి వెళ్తుందా? దీనిలో రజనీకాంతే నటిస్తాడా? అదే జరిగితే ఒకేసారి రంజిత్‌పాతో రజనీ రెండు చిత్రాలు చేయనున్నాడా? లేక కళైపులి థానుతో 'కబాలి' టైమ్‌లో మనస్పర్దలు వచ్చిన రజనీ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటాడా? లేక వేరే హీరోతో 'కబాలి2'ని ప్లాన్‌ చేశారా? అనే కన్‌ఫ్యూజన్‌ రజనీ అభిమానులతో పాటు కోలీవుడ్‌ సినీ వర్గాలను కూడా కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. కాగా 'కబాలి2'లో రజనీ స్థానంలో అజిత్‌ను కళైపులి థాను తీసుకోనున్నాడని, మరి అందుకు అజిత్‌ ఒప్పుకుంటాడా? లేదా? అన్న పాయింట్‌పై కోలీవుడ్ లో విపరీతమైన చర్చ నడుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ