Advertisementt

శర్వానంద్ డేరింగ్ డెసిషన్!

Tue 03rd Jan 2017 12:04 PM
sharwanand,sharwanand movies,sharwanand daring decision,deva katta  శర్వానంద్ డేరింగ్ డెసిషన్!
శర్వానంద్ డేరింగ్ డెసిషన్!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో ఎన్నో మంచి చిత్రాలను చేసి మరీ ముఖ్యంగా 'ప్రస్థానం' చిత్రంతో మంచి పేరు సంపాదించిన యంగ్‌ టాలెంటెడ్‌ అండ్‌ వర్సటైల్‌ ఆర్టిస్ట్‌ శర్వానంద్‌. కాగా ఇటీవలి కాలంలో 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' వంటి విభిన్న చిత్రంలో కూడా నటించి ప్రశంసలు అందుకున్న ఆయనకు కమర్షియల్‌ హీరోగా 'రన్‌ రాజా రన్‌' బ్రేక్‌నిచ్చింది. ఇక 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తో ఆయన మరోసారి మంచి హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో 'శతమానం భవతి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి', చిరు 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రాలకు పోటీగా జనవరి14న సంక్రాంతి రేసులోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ యంగ్‌హీరో తన 25వ చిత్రంగా భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాణంలో చంద్రమోహన్‌ అనే నూతన దర్శకునితో చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో 'మహానుబాహుడు'కి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా శర్వా మరో దర్శకునికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 'వెన్నెల, ప్రస్థానం' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకొని, శర్వాను వెలుగులోకి తెచ్చిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌ దేవ కట్టా. కాగా ఈయన దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా రూపొంది. ఎన్నోసార్లు వాయిదా పడి ఎట్టకేలకు విడుదలైన 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం ఫ్లాప్‌ అయింది. దీంతో దేవకట్టాను అందరూ మర్చిపోతున్నారు. ఏ హీరో కూడా ఆయనతో చిత్రం చేయడానికి ముందుకు రావడం లేదు.కానీ శర్వా మాత్రం దేవకట్టా టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో ఆయన దర్శకత్వంలో మరో చిత్రానికి ఓకే చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ