Advertisementt

రవిబాబు సాహసం సమ్మర్‌లో....!

Mon 02nd Jan 2017 07:14 PM
ravibabu,adhugo movie,pig based movie,adhugo movie first look  రవిబాబు సాహసం సమ్మర్‌లో....!
రవిబాబు సాహసం సమ్మర్‌లో....!
Advertisement
Ads by CJ

వైవిధ్యభరితమైన కథాంశాలతో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసే దర్శకుల్లో నటుడు, డైరెక్టర్‌ రవిబాబుది ప్రత్యేకశైలి అనే చెప్పాలి. కొత్తదనంతో నిండిన చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల్లో ఆయన చిత్రాలకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 'అల్లరి' నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రవిబాబు మాత్రం తనపంథా మార్చలేదు. తాజాగా ఆయన పందిపిల్లపై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు పలువురు డైరెక్టర్లు కోతులు, పాములు, ఏనుగులు, కుక్కలు, ఈగల వంటి వాటిని బేస్‌ చేసుకొని చిత్రాలు తీశారు. కానీ పందిపిల్లతో మాత్రం ఎవ్వరూ చిత్రాలను తీయలేదు. దీంతో ఈచిత్రం చరిత్రలో నిలిచిపోనుంది. అభిషేక్‌, నాభి జంటగా రూపొందుతున్న ఈ పందిపిల్ల చిత్రానికి 'అదుగో' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన విషయం కూడా తెలిసిందే. రవిబాబుకు 'అ' సెంటిమెంట్‌ ఉండటంతో పాటు, సినిమా చూస్తే ఈ టైటిల్‌కి కూడా మంచి జస్టిఫికేషన్‌ ఉంటుందని యూనిట్‌ చెబుతోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. పందిపిల్లను చూపిస్తూ, దానిపై ఓ చేయి కత్తి పట్టుకొని ఉండే స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. కత్తిపై 'ది సమ్మర్‌' అని రాసివుంది. సో.. ఈ ఆద్యంతం వినోదభరితమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ విలక్షణ చిత్రం సమ్మర్‌ పోటీలో నిలవనుందని అర్ధమవుతోంది. డి.సురేష్‌బాబు ప్రోత్సాహంతో ఆయన సమర్పకునిగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం రూపొందుతుండగా, రేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ఈచిత్రం నిర్మితమవుతూ, ప్రస్తుతం షూటింగ్‌ ముగించుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరి రవిబాబు సాహసం ఎటువంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సివుంది.....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ