Advertisementt

పవన్‌ ఏదీ దాచుకోడు...!

Mon 02nd Jan 2017 07:02 PM
pawan kalyan,dangal,twitter,pawan kalyan praises dangal  పవన్‌ ఏదీ దాచుకోడు...!
పవన్‌ ఏదీ దాచుకోడు...!
Advertisement
Ads by CJ

సామాజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లో స్పందిస్తారు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్నిప్రశంసల్లో ముంచెత్తారు. వసూళ్లను అద్భుతంగా రాబడుతూ దేశం లోనే సంచలనం సృష్టిస్తున్న అమీర్ ఖాన్ 'దంగల్' చిత్రం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అమిర్ ఖాన్ ఈ చిత్రంలో అద్భుత నటనని కనబరిచారని, ఆ నటనతోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు . 

ఈ చిత్రాన్ని చూసిన తరువాత తాను 'దంగల్' గురించి తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నానని పవన్ అన్నారు . ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్  అభినందించారు . ప్రేక్షకులు లీనమయ్యేలా ఈచిత్రాన్ని తెరకెక్కించారని పవన్ అన్నారు. మిగత నటీనటులను, సాంకేతిక బృందానికి కూడా పవన్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం మహిళలసాధికారత గురించి మనందరం ఆలోచించేలా చేసిందని పవన్ కళ్యాణ్  అన్నారు. కాగా తన ట్విట్టర్ లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్  రాజకీయ, సామజిక సమస్యల గురించే ట్వీట్ లు చేస్తూంటారు. ఓ సినిమా గురించి ట్వీట్ చేయడంఇదే తొలిసారి. ఈ చిత్రం లో మహిళల సాధికారత గురించి అద్భుతంగా చూపించడంతో చిత్ర బృందాన్నిఅభిందించాలని పవన్ కళ్యాణ్  ఈ చిత్రం పై స్పందించారు . 

పవన్‌ సినిమా స్టారే గానీ... ఆయన నిజజీవితంతో సినీ వాతావరణానికి దూరంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఉంటూ ఉంటాడు. అలాగే ఆయన ఇతరుల సినిమాల గురించే కాదు.. తన చిత్రాలపై కూడా పెద్దగా స్పందించడు. కానీ ఆయన తాజాగా సంచలనం సృష్టిస్తోన్న అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' చిత్రంపై మాత్రం ప్రశంసల వర్షం కురిపించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ