సూపర్ స్టార్ మహేష్, మెగా హీరో రామ్ చరణ్ లు తమ ఫ్యామిలీలతో కలిసి ట్రిప్ లో వున్న విషయం తెలిసిందే. 'ధృవ' చిత్ర విజయం తో రామ్ చరణ్.. ఉపాసనతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి విదేశాలకు చెక్కేసాడు. ఇక మహేష్ తన ఫ్యామిలీతో కలిసి క్రిష్టమస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం స్విట్జర్లాండ్‌లో గడుపుతున్నారు. ఇక మహేష్, చరణ్ లు ఇద్దరూ కలిసే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరు ఇద్దరూ తమ తమ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తూ దిగుతున్న ఫొటోస్ చూస్తుంటే అబ్బో మెగా ఫ్యామిలీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ ఇంత క్లోజా అని అటు మెగా అభిమానులు, ఇటు ఘట్టమనేని అభిమానులు సంబరాలు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ తన బావ గల్లా జయదేవ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోస్, మహేష్, చరణ్ లు కలిసి దిగిన ఫొటోస్ చూసిన వారు వీరంతా కలిసి విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భం గా మహేష్ భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసన,మహేష్, చరణ్ లు కలిసి న్యూ ఇయర్ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ నగరంలో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలా ఫోటో చూసిన వారంతా అబ్బా ఎంత చూడముచ్చటగా వున్నారు వీరంతా అని అనుకుంటున్నారు.