'ధృవ' చిత్రం సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో రామ్ చరణ్ తన తండ్రి 150 వ చిత్ర 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలకు కావాల్సిన పబ్లిసిటీ పనుల్లో మునిగి తేలుతున్నాడు. పైగా 'ఖైదీ...' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత కావడంతో 'ఖైదీ...' అన్ని ఏరియాలకు సంబందించిన హక్కులను రికార్డ్స్ ప్రైస్ కి విక్రయించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రామ్ చరణ్ గురించి ఒక ఆశక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే తన తండ్రి నటిస్తున్న'ఖైదీ నెంబర్ 150 ' చిత్రానికి సంబందించిన నైజాం ఏరియా హక్కులని ఎవ్వరికి ఇవ్వకుండా రామ్ చరణ్ దగ్గరే వుంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే చరణ్ 'ధృవ' చిత్రం నైజాంలో రికార్డు కలెక్షన్స్ సాధించి రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అందుకే చెర్రీ ఇలా తన తండ్రి సినిమా హక్కులను తన వద్దే వుంచుకున్నాడనే ప్రచారం మొదలైంది. మరోపక్క చరణ్ చెప్పిన ధరకి 'ఖైదీ....' నైజాం హక్కులు అమ్ముడుపోక ఏషియన్ ఫిల్మ్ ను ముందు పెట్టి చరణే 'ఖైదీ నెంబర్ 150 ' చిత్రాన్ని విడుదల చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక ఎదో ఏషియన్ ఫిల్మ్ కి ఖైదీ.... హక్కులని అమ్మినట్టు చెబుతున్న చరణ్ మొత్తం ఏషియన్ ఫిల్మ్ వెనుకుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. ఇక చిరు 150 వ చిత్రం 'ఖైదీ...' హిట్ అయితే ఒకరేంజ్ లో చరణ్ దశ తిరిగినట్టే. ఇక నిర్మాతగా చరణ్ బాగా తెలివిగా నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు మెగా అంభిమానులు.