9ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తోన్న 'ఖైదీ నెంబర్ 150'లోని పాటలు అభిమానులలో జోష్ నింపుతున్నాయి. కాగా ఇప్పటికే 'అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు, సుందరి..సుందరి, యూ అండ్ మి' పాటలు విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇవ్వన్నీ ఒక ఎత్తైతే నిన్న విడుదలైన ఐటం సాంగ్ 'రత్తాలు.. రత్తాలు' పాట మరో ఎత్తుగా చెప్పవచ్చు. మొదటి మూడు పాటల్లో కేవలం బ్యాక్‌గ్రౌండ్‌లో పాటలు వినిపిస్తూ విజువల్ స్టిల్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. కానీ తాజాగా 'రత్తాలు. రత్తాలు' ఐటంలోని చిరు వేసిన కొన్ని స్టెప్స్‌ను కూడా చూచాయగా చూపిస్తూ నిర్మాత చరణ్ విడుదల చేశాడు.
ఈ పాటలో చిరు మరలా 61 ఏళ్ల వయసులో కూడా అలనాటి మ్యాజిక్‌ను తన స్టెప్స్‌తో రిపీట్ చేశాడని ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక ఈ పాటలో నర్తించిన లక్ష్మీరాయ్ అందాలు కూడా ఈ పాటకు బాగా ప్లస్ కానున్నాయని అర్ధమవుతోంది. ఈ ఇంట్రో సాంగ్‌కు లారెన్స్ కొరియోగ్రఫీ, దేవిశ్రీ ట్యూన్‌లు నిజంగానే అదిరిపోయాయి. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క సిట్యూయేషన్ సాంగ్‌ను కూడా ఈ రోజు విడుదల చేయనున్నారు. మొత్తానికి ఈ ఒక్క పాటతోనే చిరు తన చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాడనే చెప్పాలి. మరోపక్క పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు'లో పూర్తిగా పవన్ గెటప్‌ను చూపిస్తూ విడుదల చేసిన మోషన్‌పోస్టర్ కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.
వీరిద్దరితో పాటు యువమెగాహీరోలైన సాయిధరమ్‌తేజ్-గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'విన్నర్' ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఇందులో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ అందాల ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంటుందని అర్ధమవుతోంది. ఇక విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్న వరుణ్‌తేజ్ నటిస్తున్న 'మిస్టర్' టీజర్ కూడా విడుదలైంది.
దీనిలోని ఫీల్ బాగా ఉంది. లావణ్యత్రిపాఠి, హెబ్బాపటేల్‌లు ఆకట్టుకుంటున్నారు. కోనవెంకట్‌తో విడిపోయిన శ్రీనువైట్ల గోపీమోహన్-శ్రీధర్‌సీపానలతో ఈ చిత్రం చేస్తుండటం విశేషం. ఇక తన కెరీర్‌లో 'ఆనందం' తర్వాత మరోసారి శ్రీనువైట్ల పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం విజువల్స్, లొకేషన్స్ వంటివి ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి కొత్త ఏడాది ప్రారంభంలోనే మెగాహీరోలు తమ అభిమానుల ఆనందాన్ని పదింతలు చేశారని చెప్పవచ్చు.