దగ్గుబాటి వారసుడిగా, ఆరడుగుల ఆజానుభాహుడిలా అచ్చు హాలీవుడ్ హీరోలా కనిపించే యంగ్‌టాలెంటెడ్ యాక్టర్ దగ్గుబాటి రానా. కాగా ఈయనకు ఇప్పటివరకు సోలో హీరోగా హిట్ లేదు. కానీ తనకు నచ్చిన అన్ని పాత్రల్లో నటిస్తూ, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటూ ఎదుగుతున్నాడు. 'బాహుబలి పార్ట్1'లో ఆయన నెగటివ్ పాత్రైన భళ్లాళదేవగా ప్రభాస్‌తో పోటీపడి నటించాడు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్ కంటే రానా పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయన్నది వాస్తవం. దీంతో ఆయన మరోసారి అన్నిభాషల్లో విశేష గుర్తింపును తెచ్చుకుని, దేశవ్యాప్తంగా మరింత క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయన వెండితెరపై కనిపించలేదు. ఆ లోటును ఆయన కొత్త ఏడాదిలో తీర్చనున్నాడు.
రానా హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఘాజీ' ఫిబ్రవరిలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో ఆయన నేవీ ఆఫీసర్‌గా అద్బుతంగా నటించాడనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఆయన నటిస్తున్న 'బాహుబలి2' చిత్రం కూడా ఏప్రిల్ చివర్లో విడుదలకానుంంది. ఇప్పటికే ఆయన ఫస్ట్‌లుక్‌కు ఎంతో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం కోసం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ పార్ట్‌లో కూడా ఆయన భళ్లాలదేవగా నటించిన పాత్ర చిత్రానికి మెయిన్ హైలైట్‌గా నిలవనుంది. మరోవైపు ఆయన తేజ దర్శకత్వంలో కాజల్‌అగర్వాల్‌తో కలిసి 'నేనే రాజు... నేనే మంత్రి' చిత్రంలో సోలోహీరోగా నటిస్తున్నాడు. ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చి, ప్రస్తుతం ఫేడవుట్ అయిన తేజ ఈ చిత్రాన్ని ఎంతో కసితో తీస్తున్నాడు. ఈ చిత్రంపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఏడాదైనా ఆయన సోలోహీరోగా నిలదొక్కుకుంటాడో? లేదో? వేచిచూడాల్సివుంది.