పవన్‌కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'కాటమరాయుడు'. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పవన్ స్నేహితుడు శరత్‌మరార్ నిర్మాతగా, 'గోపాల..గోపాల' ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తమిళ 'వీరం' ఆధారంగా రూపొందుతోంది. ఇప్పటికే 70శాతం వరకు టాకీపార్ట్ పూర్తయింది. ఇక ఈ చిత్రంలో ఫ్యాక్షన్ లీడర్‌గా, నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటిస్తున్నాడు. ఇందులో రావు రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు జె.మహేంద్రన్ ఓ కీలకపాత్ర చేస్తున్నట్లు సమాచారం. 'జానీ, మెట్టి, నందు' వంటి చిత్రాల ద్వారా దర్శకునిగా మంచి పేరు సంపాదించిన ఆయన ఇటీవల విజయ్ హీరోగా వచ్చిన 'తేరీ' చిత్రంలో విలన్‌గా నటించి మంచిమార్కులే కొట్టేశాడు. ఈయన మొదటిసారిగా ఈ తెలుగు స్ట్రెయిట్ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల వరుసగా ఈ చిత్రం ప్రీలుక్స్‌ను యూనిట్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. బాంబులు పేలడంతో లేచిన దుమ్ము బ్యాక్‌డ్రాప్‌లో తెల్లటి పంచెను నించోని చేత్తో అందుకుంటున్న ఈ పోస్టర్స్ మాములు హడావిడి చేయలేదు. ఫుల్ లుక్ వచ్చే వరకు..ఫ్యాన్స్ అయితే అస్సలు ఆగలేక పోయారనుకోండి. ఈ చిత్ర పోస్టర్స్ పై మొదట.. వర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా వచ్చిన 'రౌడీ' చిత్రం పోస్టర్స్‌ను కాపీ అన్నట్లు వార్తలు వచ్చినా..ఆ పోస్టర్స్ కి..ఈ పోస్టర్స్ కి నక్కకి..నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఫ్యాన్స్ కొట్టిపారేశారు. మరి దీనిపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్స్‌ను చూసి, పవన్ మేనల్లుడు సాయిధరమ్‌తేజ్, అబ్బాయ్ వరుణ్‌తేజ్, నిర్మాత బండ్లగణేష్, దర్శకుడు హరీష్‌శంకర్‌లు పోస్టర్స్ కేకపుట్టిస్తున్నాయని..ఆ పంచ కట్టు ఏదైతే వుందో..అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.