Advertisementt

న్యూ ఇయర్ లో 'విన్నర్' అవుతాడంట..!

Sun 01st Jan 2017 04:20 PM
winner,sai dharam tej,new year wishes posters,gopichand malineni,anasuya,rakul preet singh  న్యూ ఇయర్ లో 'విన్నర్' అవుతాడంట..!
న్యూ ఇయర్ లో 'విన్నర్' అవుతాడంట..!
Advertisement
Ads by CJ

నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తూ గోపిచంద్ మ‌లినేని - సాయి ధరమ్  తేజ్ కాంబినేషలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'విన్నర్'. వచ్చే న్యూ ఇయర్ లో సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' తో గట్టిగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భం గా 'విన్నర్' పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఈ పోస్టర్స్ లో రావిష్ లుక్ తో రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అందాల ఆరబోతకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా తేజ్.. గుర్రం పైకెక్కి రైడ్ చేస్తున్న పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది. మెగా హీరోల్లో ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తేజ్.. ఈ 'విన్నర్' తో కూడా విజయం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇక ఎప్పటిలాగే రకుల్ ప్రీత్ అందాలతో మత్తెక్కిస్తుందని ఈ పోస్టర్స్ చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం లో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఒక ఐటెం సాంగ్ లో మెరవడం ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. రకుల్ అందాలు, అనసూయ ఐటెం, తేజ్ కాన్ఫిడెంట్ తో ఈ చిత్రం 2017 లో మంచి హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ