డబ్బింగ్ చిత్రంగా విడుదలైన 'బిచ్చగాడు' చిత్రం.. ఆ చిత్ర నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కాగా అదే ఊపులో ఆయన ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి, జయసుధలు ప్రధానపాత్రల్లో 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో తన రెగ్యులర్ తరహా పాత్రలకు భిన్నంగా ఆర్.నారాయణమూర్తి ఓ మధ్యతరగతికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌గా నటిస్తుండటం విశేషం. ఇందులో పీపుల్స్‌స్టార్, సహజనటి జయసుధలు పోటీ పడి నటించారని సమాచారం. వందేమాతరం శ్రీనివాస్ అందిస్తున్న స్వరాలు ఈచిత్రానికి హైలైట్ అవుతాయంటున్నారు. హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా నటిస్తున్న నారాయణమూర్తి ఈ చిత్రంలో బ్లాక్‌మనీపై, నల్లకుబేరులపై తనవంతు పరిధిలో చేసే యుద్దంగా ఈ చిత్రం నిర్మితమవుతున్నదని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌లో ఉన్న సమయంలోనే ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులను అంతమొందించడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా చూసుకుంటే ఈ చిత్రం మోదీ నిర్ణయం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రూపొందుతున్న మొదటి చిత్రంగా రికార్డులకెక్కనుందని ఫిల్మ్‌నగర్ టాక్....! ఈ చిత్ర కథ మీద ఉన్న నమ్మకంతో బాలయ్య, చిరు, దిల్‌రాజుల చిత్రాలకు పోటీగా సంక్రాంతి బరిలో దించాలని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం అదే సమయంలో విడుదల అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సి వుంది....!