'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ అండ్ రివ్యూస్ తో థియేటర్లలో సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. ఇందులో నటించిన నారా రోహిత్.. మంచి సినిమాతో ఇయర్ ఎండింగ్ కి బై బై చెప్పేసాడు. ఈ ఏడాది రోహిత్ కి ఇది ఆరో చిత్రం. ఇప్పటిదాకా యావరేజ్ హిట్స్ తో వున్న రోహిత్ ఈసారి తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీ విష్ణు తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రానికి క్రిటిక్స్ అంతా మంచి మార్కులిచ్చేశారు. ఈ వారం ఇయర్ ఎండింగ్ లో ఎన్నో సినిమాలు విడుదలకాగా వాటిలో రోహిత్, శ్రీ విష్ణు 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం ది బెస్టుగా నిలిచింది. ఇక చిత్ర విజయంతో ఫుల్ హ్యాపీగా వున్న నారా రోహిత్ క్రిటిక్స్ అందరికి థాంక్స్ చెప్పేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడిగా వున్నాడు.
ఇక విజయంతో ఖుషీగా వున్న నారా రోహిత్ ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం గురించి గొప్పగా చెప్పేస్తున్నాడు. మామ బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. తాను సినిమాని పూర్తిగా చూడకపోయినప్పటికీ అక్కడక్కడా కొన్ని సీన్స్ చూశానని... ఆ సీన్స్ చూస్తుంటే తనకి నోటా మాట రాలేదని చెబుతున్నాడు. అంత బెస్ట్ గా బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో నటించాడని... అత్యంత అద్భుతంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతున్నాడు. ఇక 2017 మొదటి హిట్ మనదే అనే ధీమాని వ్యక్తం చేసిన రోహిత్ మాటలు చూస్తుంటే ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న భారీ అంచనాలు మరింతగా పెంచినట్లు లేదూ..! ఇదిలా ఉంటే 2017 మనదే అంటూ మెగా హీరో అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పేసి ఉండటంతో..సంక్రాంతికి మెగా, నందమూరి పోటీ మహా రంజుగా వుండబోతుందన్నది మాత్రం నిజం.