Advertisementt

ఈ ఆడియో కంపెనీ ఆనందానికి అవధుల్లేవ్..!

Sat 31st Dec 2016 05:12 PM
lahari music,manohar naidu,khaidi no 150,audio company,happy  ఈ ఆడియో కంపెనీ ఆనందానికి అవధుల్లేవ్..!
ఈ ఆడియో కంపెనీ ఆనందానికి అవధుల్లేవ్..!
Advertisement
Ads by CJ

లహరి మ్యూజిక్‌ ఆడియో సంస్థ అధినేత మనోహర్‌నాయుడు అనే సంగతి తెలిసిందే. కాగా ఎన్నో హిట్‌ ఆల్బమ్స్‌ను అందించిన ఈ సంస్థ తాజాగా చిరు 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' ఆడియో రైట్స్‌ను తీసుకొన్నారు. ఈ చిత్రం ఆడియోకి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ, ఈ ఆడియో రైట్స్‌ తమకిచ్చిన చిరు, నిర్మాత చరణ్‌, డైరెక్టర్‌ వినాయక్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ, చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రి, మెకానిక్‌ అల్లుడు, మాస్టర్‌, హిట్లర్‌' వంటి ఎన్నో మ్యూజికల్‌ హిట్‌ ఆల్బమ్స్‌ను అందించామని, ఆయన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం హక్కులు కూడా తమకే ఇవ్వడం ఆనందంగా ఉందన్నాడు. ఈ చిత్రం ఆడియో సేల్స్‌లో రికార్డు సృష్టిస్తుందని ఆయన ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు.

కాగా ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన 'అమ్మడు.. లెట్స్‌ డు కుమ్ముడు, సుందరి..సుందరి, యూ అండ్‌ మీ' పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటి తర్వాత చిత్రంలోని స్పెషల్‌ ఐటంసాంగ్‌ 'రత్తాలు.. రత్తాలు' పాట శనివారం విడుదలకానుంది. అలాగే డిసెంబర్ 31 రాత్రి నుండి ఈ చిత్రంలోని అన్ని పాటలను యూట్యూబ్‌ జుక్‌బాక్స్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తై యు/ఎ సర్టిఫికేట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలోని సాంగ్స్‌, అదిరిపోయే డైలాగ్స్‌, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో రైతుల సమస్యల మీద చిరు చెప్పే లెంగ్తీ డైలాగ్స్‌ అదిరిపోతున్నాయని సెన్సార్‌బోర్డు సభ్యులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నూతన ఏడాది మొదటి రోజైన జనవరి1న విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ