Advertisementt

వెంకీ, రామ్‌ల దోబూచులాట..!

Fri 30th Dec 2016 03:53 PM
victory venkatesh,hero ram,director pame kishore tirumala,puri jaghanadam,guru movie,released on january 26th 2017  వెంకీ, రామ్‌ల దోబూచులాట..!
వెంకీ, రామ్‌ల దోబూచులాట..!
Advertisement
Ads by CJ

సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌, యంగ్‌ హీరో రామ్‌లు కలిసి ఆమధ్య 'మసాలా' చిత్రంలో కలసి నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ హీరోలిద్దరు ఓ టాలెంటెడ్‌ యంగ్‌ డైరెక్టర్‌తో దోబూచులాటలాడుతున్నారు. విషయానికి వస్తే ప్రస్తుతం వెంకీ బాలీవుడ్‌ మూవీ 'సాలా ఖద్దూస్‌' తెలుగు రీమేక్‌ 'గురు'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న విడుదలకు సిద్దమవుతోంది. ఆయన తన తర్వాతి చిత్రాన్ని 'నేను..శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లు... మీకు జోహార్లు' చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం క్యాన్సిల్‌ అయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతతో పాటు దర్శకుడు, వెంకీ కూడా తమ చిత్రం ఉంటుందని ప్రకటించారు.

కానీ సినిమా పరిశ్రమలో క్లారిటీ కంటే కన్‌ఫ్యూజనే ఎక్కువన్న సంగతి తెలిసిందే. కిషోర్‌ తిరుమలతో వెంకీ చేయబోయే చిత్రం ఆగిపోయిన మాట వాస్తవమేనని, ఇటీవల డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌ చెప్పిన స్టోరీ వెంకీకి బాగా నచ్చడంతో కిషోర్‌ తిరుమల చిత్రం స్థానంలో ఆయన వెంటనే పూరీతో చిత్రానికి ఓకే చెప్పాడనే వార్తలు బాగా వ్యాపిస్తున్నాయి. ఇక పూరీ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లలో ఉన్న ఆయన సీనియర్‌ స్టార్స్‌లో కేవలం నాగార్జునతో మాత్రమే రెండు చిత్రాలు చేశాడు. ఈ రెండు బాగానే ఆడాయి. చిరుతో అవకాశం వచ్చి తృటిలో చేజారింది. ఇక బాలయ్య, వెంకీలతో ఆయన ఇప్పటివరకు చిత్రాలు చేయలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తలే నిజమైతే మరో సీనియర్‌స్టార్‌ వెంకీతో కూడా పూరీ చిత్రం చేసినట్లు అవుతుంది. 

ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మరోపక్క 'నేను..శైలజ'తో కిషోర్‌ తిరుమల ద్వారా హిట్‌ అందుకున్న రామ్‌ తర్వాత చేసిన 'హైపర్‌' చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రం విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. అనిల్‌రావిపూడి, కరుణాకరన్‌లతో చేయాలని భావించి వెనకడుగు వేస్తున్నాడు. కాగా 'నేను... శైలజ' హిట్టయినప్పుడే తాను కిషోర్‌ తిరుమలతో మరో చిత్రం చేస్తానని కూడా రామ్‌ ప్రకటించాడు. ప్రస్తుతం వెంకీ-కిషోర్‌తిరుమలల చిత్రం రద్దయిందనే వార్తల నేపథ్యంలో రామ్‌ తన తదుపరి చిత్రాన్ని కిషోర్‌ తిరుమలతోనే చేయాలని భావిస్తున్నాడట. మొత్తానికి ఇటు వెంకీ, అటు రామ్‌ల మధ్య ఈ యువ దర్శకుడు నలిగిపోతున్నాడంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ