Advertisementt

బ్రహ్మి ఆశలన్నీ..చిరు 150 పైనే..!

Fri 30th Dec 2016 01:55 PM
brahmanandam,chiranjeevi,khaidi no 150,intlo deyyam nakem bhayam  బ్రహ్మి ఆశలన్నీ..చిరు 150 పైనే..!
బ్రహ్మి ఆశలన్నీ..చిరు 150 పైనే..!
Advertisement
Ads by CJ

ఎన్నో ఏళ్లుగా తెలుగు కామెడీ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో ఏలిన స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం. కాగా ఎంత భారీ రేటుకు కొన్న మెడిసిన్‌కైనా ఎక్స్‌పైరి డేట్‌ ఉండటం ఎంత సహజమో... ఎంతటి స్టార్‌ ఇమేజ్‌ ఉన్న వారికైనా ఎక్స్‌పైరి డేట్‌ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది బ్రహ్మీని చూస్తే అర్ధమవుతుంది. కాగా బ్రహ్మి.. కొంతకాలంగా బాగా వెనుకబడిపోయాడు. ఎందరో కమెడియన్లు ఆయన స్థానంలో హవా కొనసాగిస్తున్నారు. దీంతో బ్రహ్మి ప్రస్తుతం కసి మీద ఉన్నాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను షురూ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్రహ్మి స్టార్‌ కమెడియన్‌గా ఎదగడంలో ఆయన చిరుతో చేసిన చిత్రాలు బాగా ఉపయోగపడ్డాయి. అలాగే డైరెక్టర్‌ వినాయక్‌తో బ్రహ్మి నటించిన 'కృష్ణ, అదుర్స్‌, నాయక్‌, అల్లుడుశీను' చిత్రాలలో వినాయక్‌ బ్రహ్మీ చేత చేయించిన కామెడీలు అద్భుతంగా పేలాయి. దాంతో చిరు, వినాయక్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150'పై ఆయన ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం తనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఇస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో బ్రహ్మిది ఎంతో కీలకమైన పాత్ర అని, చాలా నిడివి ఆయన పాత్రకు ఉంటుందని, ఈ చిత్రంలో ఆయన కామెడీ అద్భుతంగా ఉందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇక శుక్రవారం విడుదల కానున్న అల్లరినరేష్‌ 'ఇంట్లో దెయ్యం... నాకేం భయం' చిత్రంలో కూడా ఆయన మంచి పాత్రనే చేస్తున్నాడట. అయితే ఈ చిత్రంలో కమెడియన్స్ చాలా మంది వుంటారు కాబట్టి..రావాల్సినంత గుర్తింపు అయితే రాదని అనుకుంటున్న బ్రహ్మి...చిరు మాత్రం తనను స్టార్‌హీరోల చిత్రాలలో మరలా బిజీ చేస్తాడనే ఆశతో అందరికంటే ఎక్కువగా ఆ చిత్ర విడుదల కోసం కోటికళ్లతో ఎదురుచూస్తున్నాడని అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ