Advertisementt

కోహ్లీ, అనుష్క లకు ఇంక బ్రేక్స్ లేనట్లే..!

Fri 30th Dec 2016 12:23 PM
virat kohli,anushka sharma,viran kohli and anushka sharma engagement,new year 2017  కోహ్లీ, అనుష్క లకు ఇంక బ్రేక్స్ లేనట్లే..!
కోహ్లీ, అనుష్క లకు ఇంక బ్రేక్స్ లేనట్లే..!
Advertisement
Ads by CJ

ఎప్పటినుండో ప్రేమలో మునిగి తేలుతున్న జంట క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. వీరిద్దరూ చాలాకాలం నుండి లవ్ లో వున్నారు. వీరిద్దరూ కలిసి అటెండ్ అవ్వని పార్టీ లేదు, ఫంక్షన్ లేదు. ఇక విరాట్ మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుష్క శర్మ వివిఐపి గాలరీ లో కూర్చుని క్రికెట్ ని ఆస్వాదించడం మొదలు... ఎయిర్ పోర్ట్ లో కలిసి ప్రయాణం వరకు అబ్బో ఇంకా  ఎన్నెన్నో ఈ జంట కలిసే చేశారు. అంత అన్యోన్యం గా  ఉన్న ఈ జంట అనూహ్యం గా విడిపోయిందనే వార్తలు వెలువడ్డాయి. మొన్నామధ్యన వీరిద్దరి మధ్య యేవో విభేదాల కారణం గా విడిపోయారని రూమర్స్ చాలానే వచ్చాయి. ఇది నిజమనిపించేలా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి కూడా. అయితే ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ ఈమధ్యన ఈ జంట ప్రతి ఫంక్షన్ లో పాల్గొంటూ రూమర్స్ కి చెక్ పెట్టింది.

క్రికెట్ లో బిజీగా వున్న విరాట్...... సినిమాల్లో బిజీగా వున్న అనుష్కలు  ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారట. 2017 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నారట. వీరిద్దరూ ఇప్పుడు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారట. అయితే అక్కడే న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక న్యూ ఇయర్ వేడుకలతో పాటు ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చెయ్యాలని ఇరు కుటుంబాల పెద్దలు తలచినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జనవరి ఒకటిన జరగబోతున్నట్టు సోషల్ మీడియాలో లో వార్తలు జోరందుకున్నాయి. .

ఇప్పటికే ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సంబందించిన పనులు మొదలయ్యాయని... ఇరు కుటుంబాల పెద్దలు ఈ పనుల్లో తలమునకలయ్యారని చెబుతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి  అమితాబచ్చన్ ఫ్యామిలీ, అంబానీ, కపూర్‌ల ఫ్యామిలీలతోపాటు క్రికెటర్స్ ఫ్యామిలీలు కూడా హాజరవుతున్నాయని సమాచారం. ఇక ఈ న్యూస్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్‌గా స్టేట్‌మెంట్ అయితే రాలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ