Advertisementt

వర్మే ధైర్యం అంటోన్న వంగవీటి నటుడు.!

Fri 30th Dec 2016 11:57 AM
vangaveeti,ram gopal varma,sandy,sundeep kumar  వర్మే ధైర్యం అంటోన్న వంగవీటి నటుడు.!
వర్మే ధైర్యం అంటోన్న వంగవీటి నటుడు.!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరే ఓ సంచలనం. ఆయన ఏం తీసినా ధైర్యంగా చేస్తాడు. ధైర్యంతో ముందుకు దూసుకుపోతాడు. అలాంటి గుండె ధైర్యంతో సినిమాలు చేయగల దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే... వంగవీటి చిత్రం సినిమా మొదలైనప్పటి నుండి విడుదలయ్యేంతవరకు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాంటి ఉత్కంఠకు తెరదీస్తూ మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమాత్రం వెనుదిరగకుండా వంగవీటి చిత్రాన్ని విడుదల చేశాడు వర్మ. ఆ క్రెడిట్ అంతా వర్మకే దక్కిందని చెప్పాలి.

కాగా విడుదల అయ్యాక ఆ చిత్రంపై వంగవీటి రంగ అభిమానులు నానా యాగీ చేస్తున్నా వర్మ  ఏమాత్రం వెరవకుండా  చాలా గట్టిగానే స్పందిస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా వంగవీటి చిత్రంలో గాను పూర్తిస్థాయిలో మంచి దమ్మున్న పాత్రలో నటించిన సందీప్ కుమార్ (శాండి) తాజాగా స్పందించాడు. వంగవీటి చిత్రంపై జరుగుతున్న రచ్చ విషయాన్ని అటుంచితే.. ఆ చిత్ర దర్శకుడు వర్మ ధైర్యం గురించి ఆయన స్పందిస్తూ...  వర్మ ధైర్యం కారణంగానే తాను ఈ చిత్రంలో నటించానని  శాండీ వివరించాడు. 

అలాగే శాండి మాట్లాడుతూ... సొసైటిలో ప్రభావశీలురైన వ్యక్తులపై నటించడం అంత సులభం కాదని, అలాంటి వ్యక్తులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతారని ఆయన వెల్లడించాడు. అటువంటి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు వర్మ అంటూ పేర్కొన్నాడు. గతంలో వర్మ చేసిన రక్త చర్తిత్ర చిత్రంలో కూడా మంచి స్టేచర్ ఉన్న నటులతో ఆయా పాత్రలకు జీవం పోశాడని ఆయన వివరించాడు. అయితే వంగవీటి చిత్రం తనలాంటి కొత్త నటులకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా ఆయన భావించాడు. కాగా వంగవీటి చిత్రంపై రామ్ గోపాల్ వర్మ  ఆశించిన హోప్స్ తో పాటు చక్కని నటనతో శాండీ మెప్పించాడనే చెప్పాలి.

అయితే ఇలాంటి బలమైన, చాలా వివాదాస్పదంతో కూడుకున్న పాత్రలు చేసేప్పుడు ఎలాంటి భయం అనిపించలేదా అని ప్రశ్నించగా... ఎంతో ధైర్యం కలిగిన వర్మ సినిమా తీసేప్పుడు అలాంటి భయం ఏం కలగలేదని ఆయన వివరించాడు. ఆయనతో చేసేప్పుడు భయం అనే ఆలోచనకే తావు లేకుండా నటించామని శాండీ వెల్లడించాడు. మొత్తానికి జ్యోతిలక్ష్మి, లోపర్ వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన శాండీ వంగవీటి చిత్రంతో పూర్తి స్థాయి నటుడయ్యాడన్న మాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ