బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూ, ప్రస్తుతం హాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. తాజాగా ఆమె 'బేవాచ్' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల ఓ ఫంక్షన్‌కు ట్రాన్స్‌పరెంట్ డ్రస్ వేసుకొని వచ్చి అందరి మతి పొగొట్టింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ టూరిజంకు ప్రియాంకాను ప్రచారకర్తగా నియమించింది. ఇలా అస్సాం ప్రభుత్వం తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో ఆమె ఆనందంలో మునిగిపోయింది. ఆమె తాను ఇంకా యుఎస్‌కు షిప్ట్ కాలేదని, తనకు ముంబైలో సొంత ఇల్లు కూడా ఉందని, తాను ముంబైని విడిచి ఎక్కడికీ వెళ్లనని చెప్పి, తన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది.
మరోపక్క ఇటీవల విడుదలైన 'బేవాచ్' ట్రైలర్‌లో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించానని, కానీ ఈ చిత్రంలో తాను చాలా ఇంపార్టెట్ రోల్ చేస్తున్నానని, త్వరలో రిలీజ్ అయ్యే ట్రైలర్స్‌లో తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది. ఇక మీడియోతో ఫెమినిజం గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సాధికారికత సాధిస్తున్నారని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము ఆధారపడుతున్నారని పేర్కొంది. అంతేకాదు.... మరో అడుగు ముందుకేసి ఇకపై మహిళలకు సెక్స్ కోసం, పిల్లల కోసం తప్ప మగాళ్లతో పనిలేదని సెలవిచ్చింది. దీనిపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. ఎంత హాలీవుడ్‌కి వెళ్లినా, హోమో సెక్స్‌వాలిటీ వంటివి మన సంప్రదాయం కాదని, కానీ ఆమె మాటలు మాత్రం అలాంటి వాటి విషయంలో మహిళలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. మరి దీనికి ప్రియాంకా ఎలా ప్రతిస్పందిస్తుందో వేచిచూడాల్సివుంది.