Advertisementt

అబ్బో భలే ఎంజాయ్ చేస్తున్నారు..!

Thu 29th Dec 2016 03:33 PM
mahesh babu family,ram charan family,galla jaydev family,christmas vecations in switzerland  అబ్బో భలే ఎంజాయ్ చేస్తున్నారు..!
అబ్బో భలే ఎంజాయ్ చేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఎప్పుడూ తన పిల్లలకి సమయం కేటాయిస్తూ మంచి ఫాదర్ గా పేరుతెచ్చుకున్నాడు. తనకేమాత్రం సమయం దొరికినా కూడా పిల్లలు, భార్యతో మహేష్ విదేశాల్లో గడిపేందుకు ప్లాన్ చేసుకుని మరీ వెళుతుంటాడు. ఏ వెకేషన్ ని అయినా చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటూ... మిగతా హీరోలకు స్ఫూర్తిదాయకంగా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు మహేష్. ఇక ఇప్పుడు క్రిష్ట్మస్ హాలిడేస్ ని మహేష్ ఈసారి తన ఫ్యామిలీతో పాటు తన బావగారు గల్లా జయదేవ్ ఫ్యామిలీ తో విదేశాల్లో ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కూడా తన ఫ్యామిలీ తో మహేష్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఫొటోస్ ని బట్టి అర్ధమైపోతుంది. 

ఇక ఈ రెండు ఫ్యామిలీల మధ్యలోకి ఇప్పుడు ధృవ విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ కూడా ఎంటర్ అయ్యాడు. రామ్ చరణ్ తన భార్యతో వెకేషన్స్ ని ఈసారి మహేష్ ఫ్యామిలీతో గడపబోతున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇక చరణ్, మహేష్ ఫ్యామిలీతో దిగిన ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. అయితే వీరు అనుకోకుండా మీట్ అయ్యారా... లేక.... కావాలనే ప్లాన్ చేసుకుని ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా టాలీవుడ్ టాప్ హీరోస్ ఇలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉండడం ఒక మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని తెలియజేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ