Advertisementt

మళ్లీ సంచలనం రేపేలా వర్మ క్రేజీ కామెంట్స్!

Thu 29th Dec 2016 12:59 PM
ram gopal varma,rgv,dangal,amir khan,rgv comments,  మళ్లీ సంచలనం రేపేలా వర్మ క్రేజీ కామెంట్స్!
మళ్లీ సంచలనం రేపేలా వర్మ క్రేజీ కామెంట్స్!
Advertisement
Ads by CJ

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటాడు. అలా ఉంటేనే ఆయనకు మజా అన్నట్లుగా అలా కొన్ని వివాదాస్పద అంశాలను కావాలని కెలుక్కుంటాడు కూడాను. నిత్యం ప్రముఖలను టార్గెట్ చేస్తూ ఆయన మనసుకు నచ్చిన విధంగా పొగడటమో, తెగడటమో చేస్తూ  ఉంటాడు. అలా  స్వతంత్రంగా పబ్లిసిటీని పిచ్చపిచ్చగా పెంచుకుంటూ ఉంటుంటాడు దర్శకుడు వర్మ.

అయితే దర్శకుడు వర్మ తాజాగా అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రాన్ని చూశాడు. వర్మ చూసి అస్సలు ఊరకుండడు కదా.. అందులో ఏదో ఒక అంశాన్నో లేకా ఏమీ లేకపోతే సైడ్ ట్రాక్ ను సీనులోకి లాగి అలా నానాయాగీ చేస్తాడు. అలాంటిదే జరిగింది తాజాగా వర్మ చేసిన కామెంట్స్ చూస్తే. దంగల్ చిత్రంలో నటించిన అమీర్ ఖాన్ పై దర్శకుడు వర్మ పొగడ్తల వర్షం  కురిపించాడు. తక్కిన హీరోలు ఖాన్ పేరును తగిలించుకొని అలా అలా చెలామని అవుతున్న హీరోలపై మాత్రం సంచలనం రేపేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమీర్ ఖాన్ కాకుండా మిగతా ఖాన్ ల వల్లనే కేవలం ప్రపంచమంతా భారతీయులందరినీ పిచ్చివాళ్లలా చూస్తుందని, కానీ ఒక్క అమీర్ ఖాన్ కారణంగానే ప్రపంచమంతా భారతదేశాన్ని గురించి సీరియస్ గా థింక్ చేస్తుందని వెల్లడించాడు.

ఇంకా వర్మ స్పందిస్తూ... చాలా రోజుల నుండి తన అబ్జెర్వేషన్ లో ఏ హీరో అయినా ఎప్పుడైనా తండ్రిగా కనిపించడానికి బరువు పెరిగి లావుగా కనబడిన దాఖలాలు ఉన్నాయా? అంటూ  ప్రశ్నించాడు. స్టార్ హీరోలుగా చెప్పుకుంటున్న వారు 50 ఏళ్ళు పైబడ్డా కూడా సిక్స్ ప్యాక్ లు అంటూ ప్రేక్షకులను వెర్రోళ్ళను చేస్తుంటే.. అమీర్ ఖాన్ మాత్రం ప్రజలకు తగిన విధంగా వారి ఆలోచనలకు తోడుగా నిలుస్తున్నాడని వర్మ తెలిపాడు. అందుకే తాను అమీర్ పాదాలను తాకాలని ఉందని వర్మ పేర్కొన్నాడు. ఇంకా వర్మ స్పందిస్తూ... తనకు దంగల్ సినిమా చూశాక స్టార్ హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తమను తామే తన్నుకోమని చెప్పాలనిపిస్తుందని వర్మ చెప్పాడు. మొత్తానికి వర్మగారు కాస్త ఓవర్ గా, ఏకాగ్రతతో చెప్పినట్లుగా అనిపించినా ఇందులో వాస్తవం ఎంతుందో ఆయన అభిమానులకే తెలియాలి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ