Advertisementt

నిఖిల్‌.. ప్లస్‌ పాయింట్స్‌ బాగా క్యాచ్ చేస్తున్నాడు!

Thu 29th Dec 2016 12:52 PM
nikhil,kesava movie,comedy,nikhil movies,nikhil plus points  నిఖిల్‌.. ప్లస్‌ పాయింట్స్‌ బాగా క్యాచ్ చేస్తున్నాడు!
నిఖిల్‌.. ప్లస్‌ పాయింట్స్‌ బాగా క్యాచ్ చేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

'స్వామి రా...రా' తో నిఖిల్‌ కెరీర్‌ ఊపందుకొంది. ఆ తర్వాత కూడా ఆయన వైవిధ్యభరిత చిత్రాలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో దుమ్మురేపాడు. కాగా ఈ చిత్రాలన్నీ విభిన్న చిత్రాలే అయినా నేటి ట్రెండ్‌ బాగా ఇష్టపడుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రం ఆయన మిస్‌ కాకుండా చూసుకుంటున్నాడు. ఆయన విజయవంతమైన చిత్రాలన్నింటిలో కామెడీ టచ్‌ ఇస్తూనే వస్తున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో కూడా కామెడీ చిత్రానికి మేజర్‌ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన తనకు 'స్వామి రా..రా'తో బ్రేక్‌ ఇచ్చిన యువదర్శకుడు సుధీర్‌వర్మతో 'కేశవ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చూస్తే ఇది నిఖిల్‌ తనకెరీర్‌లో ఇప్పటివరకు టచ్‌ చేయని మాస్‌ రివేంజ్‌ డ్రామా చిత్రంగా అర్ధమవుతోంది. దాంతో ఈ చిత్రంలో కామెడీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వాటిని నిఖిల్‌ పటాపంచలు చేశాడు. ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో ఆయన తీయించుకున్న సెల్ఫీని షేర్‌ చేశాడు. దీనిలో స్టార్‌కమెడియన్‌గా ఎదుగుతున్న వెన్నెల కిషోర్‌తో పాటు 'పెళ్లిచూపులు' చిత్రంలో తనదైన కామెడీ జోనర్‌లో మెప్పించి, ప్రస్తుతం మహేష్‌ -మురుగదాస్‌ చిత్రంలో కూడా కీలకమైన హాస్యపాత్రను పోషిస్తున్న ప్రియదర్శితోపాటు పలువురు అప్‌కమింగ్‌ కమెడియన్స్‌ కనిపిస్తున్నారు. సో.. ఈ చిత్రంలో కూడా కామెడీ డోస్‌ బాగానే ఉందని అర్దమవుతోంది. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 80శాతం పైగా పూర్తయింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ