రజనీకాంత్‌కు పని మీద ఉన్న అంకితభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. కాగా ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ విలన్‌గా, అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న '2.0' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇండియాలోనే హైయ్యస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత, సౌండ్ ఇంజనీర్ రసూల్ పోకుట్టి పనిచేస్తున్నాడు.
రజనీ చేత డబ్బింగ్ చెప్పించడం కోసం తాను చెన్నై వెళ్తున్నానని ట్వీట్ చేసిన ఆయన ఆ తర్వాతి ట్వీట్లలో రజనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రానికి ఒక్కరోజులోనే తలైవా రజనీ మూడు రీళ్లకు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి, తనని ఆశ్యర్యపరిచాడని, ఆయనకున్న అంకిత భావం చూసిన తర్వాత ఆయన అంత గొప్పనటుడు ఎలా అయ్యాడు? ఆయనకున్న వరల్డ్‌వైడ్ ఇమేజ్‌కి కారణాలు తనకి అర్ధమయ్యాయన్నాడు. ఈ చిత్రం 'రోబో'కు సీక్వెల్ కాదని, ఇదో విభిన్నమైన చిత్రమని మెచ్చుకున్నాడు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.