ఒక్కప్పుడు హీరోలు తామున్న బిజీలో ఫస్ట్ షూటింగ్, నెక్ట్స్ ఫ్యామిలీ అనే వారు. కానీ నేటితరం హీరోలు మాత్రం ఫ్యామిలీలకు కూడా తగినంత సమయం వెచ్చిస్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి. ఆయనకు కొంచెం విశ్రాంతి లభించినా, తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడోక్కడ వాలిపోతాడు. తాజాగా ఆయన మురుగదాస్ చిత్రం గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో యూరప్ పర్యటనకు వెళ్లాడు.
ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ల్యాండ్ అయ్యాడు. అక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇక కొత్త ఏడాది మొదటి రోజుకి ఫ్యామిలీతో కలిసి లండన్ చేరుకొని, అక్కడే న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోనున్నాడు. కాగా మహేష్ ఎప్పుడు ఫ్యామిలీట్రిప్‌కి వెళ్లినా, కేవలం తన ఫ్యామిలీతో మాత్రమే కలిసి వెళ్లేవాడు. కానీ ప్రస్తుతం టూర్‌లో మాత్రం ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా విడుదలైన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జనవరి మొదటి వారంలో మహేష్ ఇండియాకు తిరిగివచ్చి, మురుగదాస్ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటాడు.