Advertisementt

'జబర్దస్త్‌' హంగామా..!

Wed 28th Dec 2016 07:52 PM
jabardasth comedy show,eetv,anchors suma,anusuya,reshmi,roja,nagendrababu  'జబర్దస్త్‌' హంగామా..!
'జబర్దస్త్‌' హంగామా..!
Advertisement
Ads by CJ

నేడు సినిమా రంగంతో పోటీగా బుల్లితెర ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం విస్తరిస్తోంది. దీంతో పలు అగ్ర సినీ నిర్మాణ రంగ సంస్థల చూపు కూడా బుల్లితెరపై పడుతోంది. బుల్లితెర యాంకర్లయిన సుమ, అనసూయ, రేష్మి, శ్రీముఖి, ప్రదీప్‌, రవి, చలాకి చంటి వంటి పలువురు బుల్లితెరపైనే కాదు.. పలు చిత్రాల హోస్ట్‌లుగా వెలుగొందుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై విఫలమైన సుమకు ఇప్పుడు బుల్లితెరపై ఉన్న క్రేజ్‌ అసమాన్యం. ఇటీవల జరిగిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియోలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి, అనర్గళ ప్రసంగీకుడు, బహుభాషా పండితుడైన వెంకయ్యనాయుడు సుమ గొప్పతనం గురించి, బాలయ్య కన్నా సుమాను ఎక్కువగా పొగుడుతూ, ఏకంగా 10 నిమిషాలపాటు ప్రసంగించిన సంగతి తెలిసిన వారికి ఇది నిజం అని అర్ధమవుతుంది. 

ఇక అనసూయ, రేష్మి, శ్రీముఖి, లాస్య వంటి పలువురు వెండితెరపై కూడా హిట్  పుట్టిస్తున్నారు. విషయానికి వస్తే ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్‌' ప్రోగ్రాంకు వచ్చినంత స్పందన మరో కార్యక్రమానికి రాలేదనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంలో తమ కామెడీతో అదరగొట్టిన పలువురు ప్రస్తుతం వెండితెరపై హాన్యనటులుగా దూసుకుపోతున్నారు. ఎప్పుడు బిజీగా ఉండే 'జబర్దస్త్‌' టీంలోని సభ్యులతో పాటు జడ్జి నాగబాబు కూడా కలిసి గోవాకు వెకేషన్‌కు వెళ్లి, క్రిస్మస్‌ వేడుకలను అక్కడే జరుపుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోను అనసూయ షేర్‌ చేసింది. ఈ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ