Advertisementt

జీవిత కి 'టెంపర్' లేచింది...!

Wed 28th Dec 2016 01:12 PM
jeevitha rajasekhar,jeevitha about sociaty,jeevitha fire on movies,jeevitha,temper  జీవిత కి 'టెంపర్' లేచింది...!
జీవిత కి 'టెంపర్' లేచింది...!
Advertisement

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రంలోని డైలాగ్‌ అప్పుడు చాలా విమర్శలపాలైంది. తాజాగా నటి, రాజకీయనాయకురాలు జీవిత వల్ల ఆ డైలాగ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్‌ కాజల్‌, ఎన్టీఆర్‌తో...మీ పోలీస్‌కుక్కలు ఎంతో ఫాస్ట్‌గా ఉంటాయట. మా కుక్కలు క్రాసింగ్‌కు వచ్చాయి. వాటిని పంపుతారా? అని అడిగితే ఎన్టీఆర్‌ దానికి 'మేము క్రాసింగ్‌కు వచ్చినా దిక్కులేదు. కుక్కలకు క్రాసింగ్‌ కావాలంట..!' అంటాడు. ఓ హీరో చేత అలాంటి డైెలాగ్‌ చెప్పించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని జీవిత విమర్శించింది. ఒకప్పుడు సినిమాలలో 'ఐ లవ్‌ యు' అనే పదాన్ని కూడా అరుదుగా, ఎంతో సున్నితంగా వాడేవారు. కానీ నేడు ఆ పదం కామన్‌ అయిపోయింది. నేటి యువత హీరోలను ఎంతగానో అభిమానిస్తున్నారు. దేవుడే దిగి వచ్చి చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినని ఈ తరం యువత తమ అభిమానహీరోల మాటలను, డైలాగ్‌లను ఫాలోఅవుతున్నారు. స్టార్‌హీరోలను, హీరోయిన్లను పెట్టి బూతు, మితిమీరిన శృంగారం, హింస చూపిస్తున్నారు. అవి నేటి యువతరానికి ఆదర్శంగా మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసింది. 

సినిమా అనేది చాలా శక్తివంతమైన మీడియా. సినిమాల ద్వారా మంచి సందేశాన్ని హీరోల చేత చెప్పించాలి. అది అందరి కనీసబాధ్యత. మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి సినిమాలు ఒళ్లు దగ్గరపెట్టుకొని తీయాలి. ఇక కొందరు హీరోలు పలు కంపెనీల యాడ్స్‌లో నటిస్తున్నారు. కానీ అవి సమాజానికి ఉపయోగపడే ప్రొడక్ట్సా..కాదా? అని ఆలోచించుకొని చేయాలని మహేష్‌ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించింది. అన్నం, నిద్ర, కాఫీ వంటి లాగానే సెక్స్‌ కూడా జీవితానికి ముఖ్యమే అయినా ఆ వంకతో యువతరాన్ని చెడుమార్గం పట్టించవద్దని కోరింది. ఇంకా ఇంటర్నెట్‌లు, వాట్సప్‌లు వంటి సోషల్‌ మీడియాల ద్వారా యువత తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారంది. 

ఒకప్పుడు సెక్స్‌ వీడియోలు ఎంతో సీక్రెట్‌గా చూసేవారు. కానీ నేటి యువతకు అదో ఫ్యాషన్‌ అయిపోయింది. మొదటి చూపులో ఆకర్షణ, రెండోరోజు ముద్దు, మూడో రోజు కౌగిలింత.. నాలుగో రోజు మరోటి.. ఐదో రోజు విడిపోవడంగా నేటి తరం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా పలు విషయాల గురించి మాట్లాడిన ఆమె 'పింక్‌' వంటి చిత్రాలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వీధికో బార్‌, పబ్‌లు వెలుస్తున్నాయని, దీనికి రాజకీయనాయకులు, తల్లిదండ్రులు, యువతరం, సినిమావారు.. ఇలా అందరూ బాధ్యులేనని తేల్చిచెప్పింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement