Advertisementt

తైమూర్‌ అంటే అర్ధం ఇది...!

Wed 28th Dec 2016 12:30 PM
  తైమూర్‌ అంటే అర్ధం ఇది...!
తైమూర్‌ అంటే అర్ధం ఇది...!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ జంట కరీనాకపూర్‌, సైఫ్‌అలీఖాన్‌ దంపతులు తాజాగా ఓ మగబిడ్డకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కాగా ఆ జంట తమ బిడ్డకు 'తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ' అని నామకరణం చేసారు. తమ బిడ్డకు పెట్టిన పేరుతో పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తైమూర్‌ అనే పేరు గల మంగోలియా రాజు 14వ శతాబ్దంలో డిల్లీపై దండయాత్ర చేసి, ఎంతో మంది భారతీయులను చంపాడు. దీంతో ఈ పేరును ఆ జంట తమ బిడ్డకు పెట్టడంపై విమర్శలు మొదలయ్యాయి. కాగా కరీనాకి అంకుల్, సీనియర్‌ నటుడు రిషికపూర్‌ ఈ విషయంలో నెటిజన్లపై మండిపడ్డారు. తమ బిడ్డకు నచ్చిన పేరు వారు పెట్టుకున్నారు. మీ బిడ్డకు వారేమీ పేరు పెట్టలేదు కదా...! అంటూ సెటైర్లు విసిరిన సంగతి తెలిసిందే. అలాగే 'అలెగ్జాండర్‌, సికిందర్‌'లు ఏమీ ఆధ్యాత్మిక గురువులు కాదు కదా...! మరి ఆ పేర్లు ఎంత మంది పెట్టుకోవడం లేదంటూ ప్రశ్నించారు. తాజాగా కరీనా-సైఫ్‌ల జంట కూడా తమ బిడ్డ పేరుపై వివరణ ఇచ్చారు. టర్కీ భాషల్లో తైమూర్‌ అంటే ఇనుములాంటి ధృడమైన అని అర్ధమని, అందుకే తాము తమ బిడ్డకు ఆ అర్ధం స్ఫురించేలా పేరు పెట్టామని తెలిపారు. కాగా తమ బుల్లి నవాబు పేరు ఇంత వివాదాస్పదమవుతుందని ఆ జంట ఊహించి ఉండరు అయినా వారు ప్రస్తుతం ఈ విమర్శలు పట్టించుకునే స్థితిలో లేరు. తమకు బుల్లి నవాబు పుట్టాడన్న ఆనందంలో వారు ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ