Advertisementt

కొత్త పాఠాలు నేర్పిన 2016 చిత్రాలు..!

Tue 27th Dec 2016 05:45 PM
heroes,ram,nagarjuna,ntr,nithiin,nikhil,ram charan,2016 hit telugu movies  కొత్త పాఠాలు నేర్పిన 2016 చిత్రాలు..!
కొత్త పాఠాలు నేర్పిన 2016 చిత్రాలు..!
Advertisement

ఈ ఏడాది టాలీవుడ్‌కి ఎన్నో కొత్త పాఠాలను నేర్పింది. స్టార్‌ హీరోల ఇమేజ్‌కు సరికొత్త కథలు తోడైతే స్టార్స్‌ రేంజ్‌ ఏస్థాయిలో ఉంటుందో నిరూపించింది. అలాగే భారీ బడ్జెట్‌తో కాదు... భారీ బలం గల వైవిధ్యమైన కథలతో వస్తే చిన్న చిత్రాలైనా, అందరూ కొత్తవారైనా, డబ్బింగ్‌చిత్రాలైనా, రీమేక్‌ చిత్రాలైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని ఈ ఏడాది నిరూపించింది. మరి ఈ ఏడాది నుండి మన దర్శకనిర్మాతలు, హీరోలు ఏ విధమైన పాఠాలు నేర్చుకుంటారో వేచిచూడాల్సివుంది. ఇక ఈ ఏడాది మొదటి రోజున వచ్చిన 'నేను... శైలజ' చిత్రం మంచి హిట్టుగా నిలిచింది. అలాగే కొత్త దర్శకులు, పెద్దగా పేరులేని నటీనటులతో వచ్చిన 'పెళ్లిచూపులు, క్షణం. పిట్టగోడ' వంటి చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. 

నాని నటించిన 'జెంటిల్‌మన్‌, కృష్ణగాడి వీరప్రేమగాధలు' బాగా ఆడాయి. చిన్న చిత్రాలుగా విడుదలైన నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', నారారోహిత్‌, నాగశౌర్యల 'జ్యో అచ్యుతానంద', త్రివిక్రమ్‌ 'అ...ఆ' చిత్రాలు బాగా సక్సెస్‌ అయ్యాయి. స్టార్‌ హీరోల చిత్రాల విషయానికి వస్తే నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' చిత్రాలు అద్భుతంగా ఆడాయి. ఎన్టీఆర్‌ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం అందరినీ మెప్పించింది. రీమేక్‌ చిత్రాలైనప్పటికీ 'ధృవ, ప్రేమమ్‌' చిత్రాలు ఆకట్టుకున్నాయి. డబ్బింగ్‌ చిత్రాలుగా విడుదలైన 'బిచ్చగాడు, 24'లు అదరగొట్టాయి. మొత్తానికి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కావాల్సిన ధైర్యాన్ని, వైవిధ్యచిత్రాలను తీయాలనుకునే ఔత్సాహికులను బాగా ఉత్సాహపరిచింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement