Advertisementt

నయన్‌, తమన్నా.. డైరెక్టర్‌ అంతు చూశారు!

Tue 27th Dec 2016 02:48 PM
star heroines,nayantara,tamanna,vishal,director suraj,okkadochadu movie  నయన్‌, తమన్నా.. డైరెక్టర్‌ అంతు చూశారు!
నయన్‌, తమన్నా.. డైరెక్టర్‌ అంతు చూశారు!
Advertisement
Ads by CJ

ప్రేమాయణంలో క్వీన్‌గా పిలవబడుతున్న నయనతార, అందంలో పాలతో పోల్చబడుతున్న తమన్నాలు..ఇప్పుడు ఓ డైరెక్టర్‌ అంతు చూసి..క్షమాపణ కూడా చెప్పించేశారు. ఎవరా డైరెక్టర్‌..? అసలేంటి విషయం అనుకుంటున్నారా..? విశాల్‌, తమన్నా హీరో హీరోయిన్లుగా 'ఒక్కడొచ్చాడు' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ సురాజ్‌. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా..షార్ట్‌ డ్రెస్‌ అండ్‌ స్కిన్‌ షో పై సూరజ్‌ స్పందిస్తూ..'హీరోయిన్స్‌ కోట్లలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. మాస్‌ ఆడియెన్స్‌ హీరోయిన్స్‌ గ్లామర్‌ కోసమే థియేటర్స్‌కి వస్తుంటారు. అందుచేత హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేసి తీరాలి. నేనైతే హీరోయిన్స్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మోకాలి కింది వరకు డ్రెస్‌ తీసుకువస్తే కట్‌ చేయమని చెబుతాను. యాక్టింగ్‌ స్కిల్స్‌ చూపించాలి అంటే సీరియల్స్‌లో చూపించుకోవచ్చు. కమర్షియల్‌ సినిమాలో కంపల్సరీగా హీరోయిన్‌ స్కిన్‌ షో చేయాల్సిందే. హీరోయిన్స్‌ని తీసుకునేదే ఎక్స్‌పోజింగ్‌ కోసం. అమ్మాయిల్ని ఎంత పొట్టి దుస్తుల్లో చూపిస్తే మాస్‌ ఆడియన్స్‌ అంతగా థ్రిల్‌ అవుతారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌తో నేను కావాలనే షార్ట్‌ డ్రెస్‌లు డిజైన్‌ చేయిస్తా..' అంటూ దర్శకుడు సూరజ్‌ నోరు జారాడు. 

దీనిపై ఫస్ట్‌ స్పందించిన నయనతార..సూరజ్‌పై పెద్ద యుద్ధమే చేసింది. ఓ వైపు పింక్‌, దంగల్‌ అంటూ సినిమాలు తీస్తూ..ఉమెన్‌ ఎమ్‌ పవర్మెంట్‌ గురించి మాట్లాడతారు. మరోవైపు ఇలా నిజస్వరూపం బయటపెట్టుకుంటారంటూ నయన్‌ ఒక్కసారిగా డైరెక్టర్‌ పై ఫైర్‌ అవుతూ..సంచలనానికి తెరతీసింది. అనంతరం ఈ సినిమాలో నటించిన తమన్నా..కూడా..సూరజ్‌ని చీల్చిచెండాడింది. కథ డిమాండ్‌ చేయబట్టే అలా చేస్తాం..తప్ప..డబ్బులు కోసం అయితే కాదంటూ..తమన్నా..స్పందించింది. సూరజ్‌ మాటలు బాధను కలిగించాయి. కోపం తెప్పించాయి. నాకే కాదు..సినిమాల్లో చేసే అమ్మాయిలందరికీ సూరజ్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేసింది తమన్నా. 

దీనిపై చిత్ర హీరో విశాల్‌ కూడా..సూరజ్‌ని తప్పుపట్టడంతో..చేసేది లేక..తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్న సూరజ్‌ వెంటనే క్షమాపణలు కోరుతూ..ఓ లెటర్‌ని విడుదల చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ