Advertisementt

బాబు మంత్రి వర్గంలో అసంతృప్తి సెగలు.!

Tue 27th Dec 2016 02:00 PM
chandrababu naidu,ke krishna murthy,tdp,chandrababu political power  బాబు మంత్రి వర్గంలో అసంతృప్తి సెగలు.!
బాబు మంత్రి వర్గంలో అసంతృప్తి సెగలు.!
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చాలా నిక్కచ్ఛిగా ఉంటుంది. ఏది మాట్లాడినా శాసించేలా మాట్లాడుతాడు. పని కూడా అలాగే ఉంటుందనుకో. కాకపోతే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి అక్కడి లోటుబడ్జెట్ తదితర అంశాలతో ఈ మధ్య కాస్త టాకింగ్ పవర్ తగ్గింది గానీ, లేకపోతే ఆయనకున్న రాజకీయానుభవానికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చాలా తక్కువ సమయంలోనే చేసేవాడు అంటుంటారు చాలా మంది. అదలా ఉంచితే ఈ మధ్య చంద్రబాబు మంత్రివర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయని అంటున్నారు చాలామంది. 

కాగా కొంత మంది మంత్రులు తాము కేవలం మంత్రులుగానే మిగిలిపోతున్నామని, తన శాఖకి సంబంధించి నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రే స్వయంగా తీసేసుకుంటున్నారని కొంతమంది మంత్రులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే, ముఖ్యమంత్రే స్వయంగా ఇంత చేస్తుంటే అంద‌రు మంత్రులూ ఒకేలా ఉండరు కదా మరి.  ఉండబట్టలేక కొంతమంది పైకి వెళ్ళకక్కుతుంటారు. మంత్రుల చేతులు క‌ట్టేసి, ఆయా శాఖ‌ల కీల‌క నిర్ణ‌యాలన్నీ అలా ముఖ్య‌మంత్రే తీసేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేం అంటూ రెచ్చిపోతున్నారు ఆయా శాఖ మంత్రివర్యులు. కాగా ఇలాంటి మంత్రులతోటే చంద్రబాబుకు తలనొప్పిపుడుతుంది. ఇంతకాలం వేచి చూసిన మంత్రులు ఈ మధ్య ఒక్కసారిగా పెట్రేగి పోతున్నారు.

ఏపీలోని ప‌రిశ్ర‌మ‌ల‌ తీరు విషయంలో మంత్రి కేయీ కృష్ణ‌మూర్తి ఈ మధ్య విమ‌ర్శ‌లు గుప్పించడంతో తెదేపాలో కలకలం రేగుతుంది. తాజాగా ఆయన స్పందిస్తూ... క‌ర్నూలు జిల్లాలో చాలా ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చేశాయ‌ని ముఖ్య‌మంత్రి చెబుతున్నాడని, కానీ వాటిల్లో ఎన్ని శంఖుస్థాప‌న‌కు నోచుకున్నాయో.. అంటూ సెటైర్ విసిరాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ కి కూడా కోట్ల రూపాయల పెట్టుబ‌డులు వ‌చ్చేశాయ‌ని తెగ గొప్పగా ప్ర‌చారం చేయించుకుంటున్నారుగానీ వాస్తవంగా అసలు వచ్చిందెంత అనేది తెలపాలని అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా బీసీ వ‌ర్గానికి చెందిన కేయీ కృష్ణమూర్తి చాలా కాలం నుండి అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది. కాగా ఈయనే కాకుండా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో మంత్రి కూడా చంద్ర‌బాబు శాఖాపరమైన జోక్యంపై అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రంగుమారిపోతుందని, ప్రధానంగా పార్టీ మూడు అధికార కేంద్రాలుగా తయారైందని, వారి ఏం చేసినా చంద్రబాబు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ఆయా మంత్రులు తీవ్ర ఆవేదనకు లోనౌతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement