Advertisementt

మెగాస్టారూ..ఇది నిజమైన కుమ్ముడేనా..?

Mon 26th Dec 2016 02:20 PM
megastar chiranjeevi,khaidi no 150,youtube views,mega star  మెగాస్టారూ..ఇది నిజమైన కుమ్ముడేనా..?
మెగాస్టారూ..ఇది నిజమైన కుమ్ముడేనా..?
Advertisement
Ads by CJ

సుమారు 9 సంవత్సరాల తర్వాత 150వ చిత్రంతో అడుగుపెడుతున్న మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రానికి సంబంధించి రిలీజ్‌ అవుతున్న టీజర్‌లు సెన్సేషన్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన టీజర్‌, అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు ఆడియో సాంగ్‌, తాజాగా సుందరి ఆడియో సాంగ్‌లు యూట్యూబ్‌లో సందడి చేస్తూ..సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆడియో సాంగ్స్‌ కూడా ఒక్కరోజులో మిలియన్‌ వ్యూస్‌ని రాబట్టుకోవడం..నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ఒక రకంగా యూట్యూబ్‌లో 'ఖైదీ..' కుమ్మేస్తున్నాడనే చెప్పుకోవాలి. 

మరి ఈ కుమ్ముడు నిజమేనా..? నిజంగానే ప్రేక్షకులు చిరంజీవి 150వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా? పొలిటికల్‌ పరంగా చిరంజీవి పై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ప్రేక్షకుల్లో దూరమైందా..? అందుకే చిరంజీవి 150కి సంబంధించి వస్తున్న వన్నీ.. రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయా..? అసలు యూట్యూబ్‌లో ఈ కుమ్ముడు..చిరంజీవిని ప్రేక్షకులు కోరుకుంటున్నారనేదానికి ఉదాహరణేనా..? లేక గతంలో కొన్ని సినిమాలకి సంబంధించి వచ్చిన ట్రైలర్స్‌ కి క్రియేట్‌ చేసిన వ్యూస్‌లా..ఈ మెగా 150 వెనుక కూడా ఏదైనా కుట్ర యూట్యూబ్‌లో జరుగుతుందా..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌నే కాకుండా..సాదారణ ప్రేక్షకుడి మదిలో కూడా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికేది మాత్రం సంక్రాంతికే అనేది తెలిసిన విషయమే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ