Advertisementt

అల్లు అర్జున్ కూతురి పేరులోని..విశేషమిదే!

Mon 26th Dec 2016 01:56 PM
arha,allu arjun and sneha reddy daughter,allu arha,arha name,greatness of arha name  అల్లు అర్జున్ కూతురి పేరులోని..విశేషమిదే!
అల్లు అర్జున్ కూతురి పేరులోని..విశేషమిదే!
Advertisement
Ads by CJ

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ దంపతులకి నవంబర్ 21 న రెండవ సంతానం గా పాప పుట్టడం అల్లు కుటుంబం లో ఆనందాలు వెల్లివిరియడం అందరికి తెలిసిన సంగతే. ఇప్పుడు తమ ముద్దుల పాపకి నామ కరణం చేసారు. మొదటి సంతానం బాబు కి ఆయాన్ అని పేరు పెట్టిన వీరు.. పాపకి అల్లు అర్హ (ALLU ARHA ) అని పేరు పెట్టారు క్రిష్టమస్ రోజు అభిమానులకి విషెస్ చెప్తూ పాప మొదటి చిత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ చేసారు. అయితే అల్లు అర్హ పేరుకి చాలా విశిష్టత వున్నట్లుగా అల్లు ఫ్యామిలీ చెప్తుంది. ఆ విశిష్టత గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. 

అర్హ అంటే హిందుత్వం లో శివుడి పేరు. అలాగే ఇస్లాం లో 'ప్రశాంతత మరియు నిర్మలమైన' అని అర్దం. హిందూ, ఇస్లాం లలో వస్తున్న అర్ధమే కాకుండా...మరో ముఖ్యమైన అర్ధం వచ్చేలా అల్లు అర్జున్ మరియు స్నేహ లు అర్హ పేరు పెట్టడం విశేషం. ARjun పేరులోని AR మొదటి రెండక్షరాలు, sneHA లోని చివరి HA రెండక్షరాలు కలిపితే వచ్చే పేరు arha. ఇదే అల్లు అర్జున్ మరియు స్నేహ ల ముద్దుల కూతురు పేరు. మరి కావాలనే ఇలా పెట్టారో..లేక యాదృచ్చికంగా జరిగిందో తెలియదు కానీ..అర్హ పేరు మాత్రం అల్లు అర్జున్, స్నేహ లకు ఓ స్పెషల్ గుర్తింపు నిచ్చేదిగా ఉండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ