Advertisementt

సత్తా చాటుతోన్న మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌..!

Mon 26th Dec 2016 12:23 AM
bollywood,foure daughters father,aamir khan,dngal movie,indai in collections 30crpres,oversis in 15 crores  సత్తా చాటుతోన్న మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌..!
సత్తా చాటుతోన్న మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌..!
Advertisement
Ads by CJ

చాలామంది మంచి సినిమాలు రావడం లేదు.. అంటూ విమర్శిస్తుంటారు. కానీ అదేమి చిత్రమో గానీ బాలీవుడ్‌ మిష్టర్‌పర్‌ఫెక్షనిస్ట్‌ ఏ చిత్రం చేసినా అది మంచి చిత్రమైపోతుంది. కథల ఎంపికలో అంతగా ఆచితూచి అడుగులు వేస్తాడు ఈ స్టార్‌. గత రెండు నెలలుగా కరెన్సీ కొరత వల్ల బాక్సాఫీస్‌ వద్ద ఒక్క బాలీవుడ్‌ చిత్రం కూడా కనీసం ఓ బ్లాక్‌బస్టర్‌ని ఇవ్వలేకపోయింది. ఆ సమయంలో అందరూ అమీర్‌ నటిస్తున్న 'దంగల్‌'పైనే ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను అమీర్‌ ఇప్పుడునిలబెడుతున్నాడు.

దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్లను చూస్తుంటే, దేశంలో నిజంగా కరెన్సీ కొరత ఉందా? అని అనుమానం వేయకమానదు. తాము ఇంతకాలంగా భద్రంగా దాచుకొన్న సొమ్మును సినిమా టిక్కెట్ల రూపంలో ఈ చిత్రంపై సినీ ప్రియులు కనకవర్షంగా కురిపిస్తున్నారు.నలుగురు ఆడపిల్లల తండ్రిగా, రెజ్లర్‌గా అమీర్‌ పడ్డ కష్టానికి ఈ చిత్రం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 45 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో 30కోట్లు, ఓవర్‌సీస్‌లో 15 కోట్లు లభించాయి. ఇక శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రం అదరగొట్టే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం హవా చూస్తుంటే లాంగ్‌రన్‌లో 300కోట్లను మించి వసూలు చేయడం ఖాయమని బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ