మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం పాటలు, ఫైట్స్‌లోనే కాదు.. హాస్యాన్ని, రొమాంటిక్ కోణాన్ని కూడా తనదైన శైలిలో చూపించే టాలెంట్ ఉండబట్టే ఆయన మెగాస్టార్‌గా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్‌కి తిరుగులేని మహారాజులా ఏలాడు. తాజాగా ఆయన దాదాపు దశాబ్దం తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్150' చిత్రం పాటలు ఈ రోజే డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. అందుకే ఓ పక్కా ప్రణాళికతతో ఒక్కో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. మొదటగా విడుదలైన 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు...' పాటతో పాటు ఆ పాట స్టిల్స్, ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రం ఫొటోలన్నింటిని మాస్‌ను టార్గెట్ చేసినవిగా కనిపిస్తూ వచ్చాయి. 60ఏళ్ల వయసులో చిరు మరలా రీఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిన తర్వాత ఆయన అప్పటిలా గ్లామర్‌గా ఉండగలడా? అప్పటి ఎనర్జీ చూపించగలడా? ఆ స్థాయి స్టెప్స్ వేయగలడా? అంటూ విమర్శకులు పలు ప్రశ్నలు సంధించారు.
వాటన్నింటికి వన్ బై వన్ ఆన్సర్ చెబుతూ వస్తున్నాడు చిరు. లుక్స్‌లో, మేకోవర్‌తో ఇప్పటికీ అదే యంగ్‌లుక్‌లో కనిపిస్తూ రఫ్పాడిస్తున్నాడు. తన మొదట పాట ద్వారా ఇందులో స్టెప్స్ అదిరిపోయే స్థాయిలో ఉంటాయనే సంకేతాలు ఇచ్చిన చిరు తాజాగా విడుదలైన రెండో పాట 'సుందరి.. సుందరి' అంటూ రొమాంటిక్ ట్యూన్‌తో దేవిశ్రీ అందించిన పాట స్టిల్స్‌లో సూపర్ రొమాంటిక్ లుక్‌లో కుమ్మేస్తున్నాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యూరప్ అందాలు, కాజల్ అదిరిపోయే గ్లామర్‌షోలు ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి నేటితరం యంగ్ స్టార్స్‌కు కూడా చిరు స్వీట్ వార్నింగ్ ఇస్తోన్న విషయం ఇప్పుడిప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తోందంటున్నారు మెగాభిమానులు.