Advertisementt

రూటు మార్చిన యువహీరో...!

Sun 25th Dec 2016 05:15 PM
hero nikhil,director swamy rara movie,sudeer varma,nikhil new movie keshava  రూటు మార్చిన యువహీరో...!
రూటు మార్చిన యువహీరో...!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో ఎవ్వరి అండదండలు లేకుండా చిత్రాలు చేస్తూ, 'స్వామిరా..రా'తో కెరీర్‌ను మలుపు తిప్పుకొని, సినిమా సినిమాకి తన రేంజ్‌ను పెంచుకుంటూ, విభిన్న చిత్రాల హీరోగా పేరుతెచ్చుకుంటున్న యంగ్‌హీరో నిఖిల్‌. కాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో సంచలన విజయం అందుకున్న ఈ చిన్నోడు నటించే తదుపరి చిత్రంపై అందరికీ బోలెడు అంచనాలున్నాయి. తన కెరీర్‌ను 'స్వామిరా..రా'తో మలుపుతిప్పిన దర్శకుడు సుధీర్‌వర్మతో ప్రస్తుతం ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'కేశవ' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. 

ఇన్నాళ్లు మన పక్కింటి అబ్బాయిలా కనిపించి, ఎలాంటి ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కోకుండా దూసుకుపోతున్న ఈ యంగ్‌హీరో తాజాగా విడుదలైన 'కేశవ' స్టిల్‌ను చూస్తే మాత్రం ఆయన ఇప్పటివరకు టచ్‌ చేయని మాస్‌ చిత్రంతో వస్తున్నాడా?అనే అనుమానం కలుగుతోంది. అయినా నిఖిల్‌ ఒప్పుకున్నాడంటే ఈ చిత్రం రెగ్యులర్‌గా నడిచే యాక్షన్‌ చిత్రం కాదని, ఇది కూడా నిఖిల్‌ అభిరుచికి తగ్గ ఓ వైవిధ్య రివెంజ్‌ డ్రామాగా తెరకెక్కుతుందనే నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా దాదాపుగా పూర్తికావస్తోంది. మొత్తానికి 'స్వామిరా..రా'తో ఈ యంగ్‌హీరోకు బ్రేక్‌నిచ్చిన దర్శకుడు సుధీర్‌వర్మ 'కేశవ' చిత్రం ద్వారా నిఖిల్‌ను మరోమెట్టు పైకెక్కించడం ఖాయమని టాలీవుడ్‌ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ