Advertisementt

చరణ్‌కి మీడియా అప్పుడు వెంట్రుక..ఇప్పుడు..?

Sat 24th Dec 2016 07:51 PM
mega power star ram charan,allu aravind,dhruva movie,director surender reddy,ram charan speek about media good thinking  చరణ్‌కి మీడియా అప్పుడు వెంట్రుక..ఇప్పుడు..?
చరణ్‌కి మీడియా అప్పుడు వెంట్రుక..ఇప్పుడు..?
Advertisement
Ads by CJ

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చాలా కాలం తర్వాత సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. 'మగధీర' తర్వాత చేసిన సినిమాలు కొన్ని సక్సెస్‌ పరంగా మంచి విజయాన్నే అందుకున్నా..చరణ్‌ని మాత్రం శాటిస్‌ఫై చేయలేకపోతున్నాయి. స్టోరీల సెలక్షన్‌ కానీ, మరే ఇతర విషయాలు కానీ..చరణ్‌కి ఆ టైప్‌ ఆఫ్‌ హిట్‌ని అందించలేకపోతున్నాయి. ఎట్టకేలకు 'ధృవ' చిత్రంతో చరణ్‌ మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాడు. రీమేక్‌ చిత్రం అయినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని అందుకోవడం నిజంగానే మాములు విషయం కాదు. అందుకే ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు సెల్యూట్‌ చేసేందుకు చరణ్‌ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. 

ఈ కార్యక్రమంలో చరణ్‌ చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించాడు. మరీ ముఖ్యంగా మీడియాపై ఆయనకున్న అపోహలు కూడా తొలగిపోయినట్లున్నాయి. గతంలో తన సినిమా ఆడియో ఫంక్షన్‌లో మీడియాకి వెంట్రుకని చూపిన చరణ్‌..ఇప్పుడు మాత్రం మీడియాని ఆకాశానికి ఎత్తేశాడు. 'ధృవ' సినిమా హిట్‌ అయ్యిందంటే దానికి మెయిన్‌ కారణం మీడియానే అని తేల్చేశాడు చరణ్‌. మంచి సినిమాలు తీసినా..రేటింగులు ఇవ్వరని మీడియాని ఆడిపోసుకుంటుంటారు. నిజంగా సరైన సినిమా తీస్తే..మీడియా వారు రేటింగులు పక్కాగా ఇస్తారని ధృవతో నిరూపించారని..ఈ సినిమా హిట్‌కి మీడియా ఎంతో సహకరించిందని..మీడియాకి సెల్యూట్‌ చేశాడు చరణ్‌. ఇదంతా చూస్తుంటే..చరణ్‌లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది కదా..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ