Advertisementt

మరో వెరైటీ టైటిల్ తో వస్తుందట..!

Sat 24th Dec 2016 02:28 PM
heroine trisha,trisha engagement cancell,trisha new movie,movie title 96,director prem kumar  మరో వెరైటీ టైటిల్ తో వస్తుందట..!
మరో వెరైటీ టైటిల్ తో వస్తుందట..!
Advertisement
Ads by CJ

త్రిష ఈ మధ్యన స్టార్ హీరోల పక్కన ప్లేస్ దొరక్క హీరోయిన్ ఓరియెంటెట్ చిత్రాలు చేసుకుంటూ పోతుంది. సినిమా జీవితం ఇలా ఉంటే.. నిజ జీవితంలో కూడా త్రిషకి కష్టాలు తప్పలేదు. ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యి పూర్తి నిరాశ నిస్పృహలకు లోనైంది. అయినా కూడా తన కెరీర్ ని పాడు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మరీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అయితే అవకాశాలు సరిగా రాకపోవడం వల్లనో లేక మరేదైనా కారణమో తెలియదు గాని త్రిష ఈ మధ్యన గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. తమిళంలో కోడి సినిమా హిట్ తో మంచి ఊపు మీదున్న త్రిష ఇప్పుడు తాజాగా ఒక చిత్రం లో నటిస్తుంది. 

ఆ చిత్రానికి ప్రేమ్ కుమార్ డైరెక్షన్ వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఒక విభిన్నమైన టైటిల్ పెట్టారు. అది విక్రమ్ కుమార్ - సూర్య కాంబినేషన్ లో వచ్చిన 24  చిత్ర టైటిల్ మాదిరిగా త్రిష చిత్రానికి కూడా 96  అని పెట్టారు. ఇక ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజే విడుదల చేశారు.  కోలీవుడ్ లో సర్వత్రా ఆశక్తిని క్రియేట్ చేసిన ఈ పోస్టర్ పై ఉన్న టైటిల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే 96  అంటే 1996  లో జరిగిన కథతో సినిమా ఏమైనా ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేసేస్తున్నారు కోలీవుడ్ జనాలు. ఇక ఈ సినిమా కూడా నాయకి మాదిరిగా  థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే సినిమాలా కనిపిస్తుంది ఆ పోస్టర్ చూస్తుంటే. మరి విభిన్నమైన టైటిల్ తో అందరిని ఆకట్టుకోవడానికి వస్తున్న త్రిష ఈసారైనా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ