Advertisementt

హిట్ డైరెక్టర్స్ వెంటపడుతున్న టాప్ హీరోలు!

Sat 24th Dec 2016 01:40 PM
ntr,ram charan,koratala siva,trivikram srinivas,hit directors,top heroes  హిట్ డైరెక్టర్స్ వెంటపడుతున్న టాప్ హీరోలు!
హిట్ డైరెక్టర్స్ వెంటపడుతున్న టాప్ హీరోలు!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఒక డైరెక్టర్ హీరో కోసం కథ తయారు చేసుకుని ఆ హీరో డేట్స్ కోసం పడిగాపులు పడేవారు. కానీ ట్రెండ్ మారింది ఇప్పుడు డైరెక్టర్స్ కోసం కొంతమంది హీరోలు తెగ వెంపర్లాడుతున్నారు. ఏదైనా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాలో నటించిన హీరోతో పాటు ఆ డైరెక్టర్ కి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. ఇంకేమిటి ఆ డైరెక్టర్ వెనుక హీరోలు పడడం అనేది సాధారణ విషయమైపోయింది. అసలిప్పటికే ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్స్ వెనకపడతాడనే పేరుంది. కొన్నిసార్లు ఎన్టీఆర్ అలోచించి మరి..చాలాసార్లు హిట్ డైరెక్టర్స్ ను ఏరి కోరి తన సినిమాలకు డైరెక్టర్ గా ఎంపిక చేసుకునేవాడు. ఇప్పటికే డైరెక్టర్స్ గా టాలీవుడ్ లో రాజమౌళికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, కొరటాల శివ కి పిచ్చ క్రేజ్ వుంది. వీరు ఇప్పటికే హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిత్యం వార్తల్లో కెక్కుతున్నారు. ఈ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి హీరోలు చాలామందే వెయిట్ చేస్తున్నారు. 

ఇప్పటికీ కొరటాల శివ కోసం రామ్ చరణ్ చూస్తుంటే శివ మాత్రం మహేష్ వైపు మొగ్గు చూపి మహేష్ తో సినిమా కోసం అప్పుడే పూజా కార్యక్రమాలు జరుపుకుని... తన సినిమా మహేష్ తో ఉందని కమిట్ చేయించుకున్నాడు. ఇక ఎన్టీఆరేమో త్రివిక్రమ్ కోసం ఎదురు చూసి చూసి డైరెక్టర్ బాబీతో సినిమా కమిట్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ కోసం అస్సలు ఆలోచించకుండా పవన్ కోసం పడిగాపులుపడి పవన్ తో సినిమా ఓకె చేయించుకున్నాడు. ఇక పవన్ సినిమా అయ్యాకైనా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా... లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. కానీ రామ్ చరణ్ కి, ఎన్టీఆర్ కి ఈ డైరెక్టర్స్ తో జత కట్టాలని మాత్రం చాలా కోరికగా ఉందట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ