సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ని ద్వేషిస్తున్నాడట. ఈ విషయాన్ని సల్మాన్ స్వయం గా ట్వీట్ చేసాడు. మీరు విన్నది నిజమే ఈ మాట సల్మాన్ స్వయం గా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అమీర్ ఖాన్ తాజాగా నటించిన 'దంగల్' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలకి ముందే 'దంగల్' ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదలైన మొదటి షో కే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లు లో దూసుకుపోతుంది. ఇప్పటికే క్రీడాకారుల జీవిత కథలతో తెరకెక్కించిన చిత్రాలన్నీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినవే ఎక్కువగా వున్నవి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన అమీర్ పై సల్మాన్ ద్వేషం కక్కుతున్నాడు. ద్వేషం అంటే నిజంగా కాదు.
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరు చాలామంచి స్నేహితులు. అయితే సల్మాన్ చాలా సరదాగా ఈ రోజు మా ఫ్యామిలీ అంత కలిసి దంగల్ సినిమా చూసింది.. ఇది 'సుల్తాన్' మూవీ కంటే బాగుంది. అమీర్ ఖాన్ నిన్ను వ్యక్తిగా వ్యక్తిగతంగా ప్రేమిస్తాను కానీ.. వృత్తిపరంగా మాత్రం ద్వేషిస్తున్నాను అంటూ చమత్కారం గా ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇప్పుడు సల్మాన్ ట్వీట్ తో ఈ సినిమాపై ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి. ఇంకా ఈ సినిమాపై అంచనాలను పెరిగి అన్ని బాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి మొదటి స్థానానికి చేరుకుంటుందనేది అక్షర సత్యం గా కనబడుతుంది.