Advertisementt

కరిష్మా కపూర్ మరీ..ఇంత స్పీడా..!

Sat 24th Dec 2016 12:03 PM
karishma kapoor,karisma kapoor and beau sandeep toshniwal,engaged,kareena kapoor sisiter  కరిష్మా కపూర్ మరీ..ఇంత స్పీడా..!
కరిష్మా కపూర్ మరీ..ఇంత స్పీడా..!
Advertisement
Ads by CJ

కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ నుండి విడాకులు తీసుకుని చాలా రోజుల నుండి దూరంగానే ఉంటుంది. తన ఇద్దరి పిల్లలని తన దగ్గరే ఉంచుకున్న కరిష్మా కపూర్ ఫ్యాషన్ షోస్ తో బిజీగా గడుపుతుంది. అయితే కరిష్మా భర్త నుండి విడిపోయాక నిన్నమొన్నటిదాకా మదర్ గా సింగిల్ గానే వుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా కరిష్మా.. సందీప్ అనే అతన్ని లవ్ చేస్తుందనే వార్తలు బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరో అయిన సందీప్ తో కరిష్మా చాలా సన్నిహితం గా ఉంటుందని... ఈ విషయం ఇటీవలే కరీనా కపూర్ డెలివరీ కోసం హాస్పిటల్ చేరినప్పటి నుండి వీరి విషయాన్ని మీడియా డీప్ గా వాచ్ చేస్తుందని చెబుతున్నారు. 

అయితే కరిష్మా, సందీప్ తో ఎప్పటినుండో సన్నిహిత సంబంధాలు నడుపుతుందని.... అసలు తన భర్త కు విడాకులివ్వడానికి కారణం కూడా సందీపే కారణమనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. విడాకులయిపోయాక ఇప్పుడు బహిరంగంగానే ఈ జంట అన్నిచోట్లా కనబడుతుందని చెబుతున్నారు. అయితే వీరు కేవలం ప్రేమలో ఉండడమే కాదు కరిష్మాకి, సందీప్ కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఒక వాదం తెర మీదకి తెస్తున్నారు బాలీవుడ్ సినీప్రియులు. ఎంగేజ్మెంట్ అవడం వల్లే కరిష్మా కొత్తగా ఒక వజ్రపుటుంగరం పెట్టుకుతిరుగుతుందని చెబుతున్నారు. అయితే కరిష్మా కపూర్ మాత్రం ఈ విషయాలపై నోరు మెదపడానికి సిద్ధం గా లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ