Advertisementt

ఈ పోస్టర్ లో వుంది.. చిరునా.. చరణా..?

Fri 23rd Dec 2016 08:13 PM
ram charan,chiranjeevi,khaidi no 150 poster,kajal agarwal  ఈ పోస్టర్ లో వుంది.. చిరునా.. చరణా..?
ఈ పోస్టర్ లో వుంది.. చిరునా.. చరణా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి 150  వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'   మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్న ఈ చిత్ర 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ యూట్యూబ్ లో తెగ రచ్చ చేసేస్తుంది. ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్ ఒక రేంజ్ లో డాన్స్ చేశారనే టాక్ బయటికి వచ్చిన తరుణంలో ఇప్పుడు 'ఖైదీ...' కి సంబందించిన మరో సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సాంగ్ లో కాజల్ నడుమందాలు, ఆమె ఆరబోసే అందాలతో పాటు చిరు భీకర డాన్స్ ని చూడబోతారని యూనిట్ ఒక హింట్ కూడా ఇస్తుంది.

'సుందరి... ' అనే సాంగ్ ని రేపు అంటే శనివారం విడుదల చెయ్యాలని చిరు అండ్ టీమ్ భావిస్తున్నారు. అయితే ఈ పాటకు సంబందించిన కాజల్ అగర్వాల్, చిరు స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తుంది. ఇక ఈ పోస్టర్ లో చిరుని చూస్తుంటే రామ్ చరణ్...లా ఉన్నాడుగా అనే కామెంట్స్ పడుతున్నాయి. ఒక సైడ్ యాంగిల్ లో చిరు అచ్చం గా రామ్ చరణా అనిపించేంతగా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ గెడ్డం పెంచుకుంటే ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఈ పోస్టర్ లో చిరు కనిపిస్తున్నాడు. అసలు అందరూ ఆ పోస్టర్ లో కాజల్ పక్కన రామ్ చరణ్ వున్నాడా అని అనుకునేంతగా చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే కాజల్ 'ఖైదీ నెంబర్ 150' ఫొటోస్ లీకై సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. 

ఇక 'ఖైదీ... ' ఆడియో వేడుకని రద్దు చేసి.... సాంగ్స్ ని డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేసి.... 'ఖైదీ... ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని 'ధ్రువ' చిత్రంలాగా  గ్రాండ్ గా చెయ్యాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ