'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' అంటూ యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న 'ఖైదీ నెంబర్ 150' సాంగ్ కి ఒక రేంజ్ లో క్లిక్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అని కూడా తెలుసు. అయితే ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో ఒక కొత్తరకం వాదన మొదలయింది. అదేమిటంటే ఈ సాంగ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని తెరమీదకి తెస్తున్నారు కొంతమంది మెగా ఫ్యాన్స్. అదేమిటంటే దేవిశ్రీ కొన్ని సినిమాలనుండి తన మ్యూజిక్ ట్యూన్స్ కాపీ కొడతాడనే పేరుంది. ఇక ఇప్పుడు ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్ కూడా కాపీ అనే వాదనని కొంతమంది మెగా ఫ్యాన్స్ తెర మీదకి తెచ్చారు.
దేవిశ్రీ మ్యూజిక్ అందించిన 'జనతాగ్యారేజ్' లోని ‘నేను పక్కాలోకల్’ తరహాలోనే ఈ ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్ ఉందనేది వీరి వాదన. మరి అంత పెద్ద మెగాస్టార్ చిత్రానికి దేవిశ్రీ ఇలా నిర్లక్ష్యం గా పనిచేయడాన్ని వారు సహించలేకపోతున్నారట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మీద వీరు ఆగ్రహంగా వున్నారని సమాచారం. అయితే దేవిశ్రీ ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్ ని కాపీ చేసాడనే వాదనని దేవిశ్రీ అభిమానులు తోసిపుచ్చుతున్నారు. దేవికి అలా కాపీ కొట్టే ఖర్మ పట్టలేదని... ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ రాత్రింబవళ్లు కష్టపడ్డాడని... ఇలా దేవిని అవమానించడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
మరి ఇప్పటికే సంక్రాతి బరిలో ఉన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' పై ఇలాంటి కాపీ ఆరోపణలే వచ్చాయి. ఇక ఇప్పుడు చిరు 'ఖైదీ నెంబర్ 150' పై ఇలాంటి రూమర్స్ రావడం నిజంగా విడ్డూరమే మరి..!