మొట్టమొదటిసారి ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న సమంత ఏ మాత్రం తడబడకుండా అభిమానులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా సమంత అభిమానులతో పంచుకుంది. అసలు ఇప్పుడు తెలుగులో ఒక్క ఆసినిమా కూడా ఒప్పుకోకుండా ఎందుకు ఖాళీగా ఉండిపోయారని సమంతని అభిమాని ప్రశ్నించగా వచ్చే ఏడాది తనవి 5 సినిమాలు విడుదలవుతుండగా నేను ఖాళీగా ఎక్కడున్నాని చెప్పింది. నా ఓటములు నాకు పాఠాన్ని నేర్పాయని... అలా అని డీలా పడకుండా మళ్ళీ సక్సెస్ కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఇక 'ఏమాయచేసావో' లో మీ నటన చాలా బాగుంది అని అడిగిన అభిమానికి... అదే నాకు అర్ధం కావడం లేదు నేను ఆ సినిమా తర్వాత మిగిలిన సినిమాల్లో సరిగ్గా చెయ్యలేక పోయానా... అని చాలా సార్లు ఆలోచించానని చెబుతుంది.
ఇంకా తమిళ 'తేరి' చిత్రంలో సమంత నటన గురించి ప్రస్తావించగా ఆ సినిమాని నేను నాగ చైతన్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చూశానని ఆ సినిమాలో నేను చనిపోయే సీన్ తర్వాత అందరూ ఏడుపు మొహాలతో కనిపించారని... అందులో చైతూ కూడా ఉన్నాడని... వాళ్ళలా నా నటన చూసి ఏడుస్తుంటే నేను అంత బాగా నటించానా అని చాలా తృప్తి పడ్డాను. ఇక ఒక అభిమాని అయితే అక్కినేని సమంత అని సంభోదించగా నేను ఇంకా అక్కినేని కోడలిని కాలేదు త్వరలోనే అవుతానని అలా పిలిచినందుకు థాంక్స్ అని చెప్పింది.
ఇక సినిమాల్లో నటించడం సులువైన పని కాదని అది చాలా కష్టంతో కూడుకున్న పని అని... అందరి మధ్యలోకి వెళ్ళేటప్పుడు అందంగా కనబడడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉండాలని...ప్రతి ఒక్కరి చూపు మన మీదే ఉంటుంది కాబట్టి చాల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకొచ్చింది.