Advertisementt

ఇదే నిజమైతే..ఎన్‌టిఆరే అక్కడ టాప్‌..!

Thu 22nd Dec 2016 09:53 PM
young tiger ntr,ntr brother kalyan ram,director babi,ntr babi combination movie  ఇదే నిజమైతే..ఎన్‌టిఆరే అక్కడ టాప్‌..!
ఇదే నిజమైతే..ఎన్‌టిఆరే అక్కడ టాప్‌..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్‌టిఆర్‌ 'జనతా గ్యారేజ్‌' తర్వాత సినిమా సెలక్ట్‌ చేసుకునేందుకు చాలా టైమ్‌ తీసుకున్నాడు. మధ్యలో టాలీవుడ్‌లోని చాలా డైరెక్టర్లతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ..చివరికి ఎన్‌టిఆర్‌ అన్న కళ్యాణ్‌రామ్‌..ఎన్‌టిఆర్‌, బాబీ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇంక అప్పటి నుండి ఎన్టీఆర్‌, బాబీ కాంబినేషన్‌ గురించి రకరకాలుగా వార్తలు వినిపించడం మొదలయ్యాయి. తెలిసి తెలిసి బాబీకి ఎలా అవకాశం ఇచ్చాడు అని కొందరు, పవన్‌కళ్యాణ్‌కి బాబీని యూజ్‌ చేసుకోవడం కుదరలేదని మరికొందరు ఇలా..అనేక రకాలు వార్తలు వినిపించడం మొదలయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్‌ క్రేజ్‌ హైలెవల్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

ఎప్పుడైతే ఈ కాంబినేషన్‌ గురించి బయటికి వచ్చిందో.. ఈ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు..ఈ సినిమా కోసం కళ్లు చెదిరే ఆఫర్లతో క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీడెడ్‌కి చెందిన రైట్స్‌ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్‌ అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఏ సినిమాకి లేని, రాని ఆఫర్‌ని ప్రకటించేశాడంట. ఎన్‌టిఆర్‌ సినిమాలకు స్టాంగ్‌ జోన్‌ సీడెడ్‌. ఈ ఏరియా రైట్స్‌ కోసం ఏకంగా ఆ డిస్ట్రిబ్యూటర్‌ రూ. 14.75 కోట్లు ఆపర్‌ చేశాడంట. ఇప్పటి వరకు ఈ ఏరియాలో పవన్‌కళ్యాణ్‌ సినిమా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' (బాబీనే దర్శకుడు) 12 కోట్ల బిజినెస్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉంది. అలాంటిది..ఎన్టీఆర్‌ మీద నమ్మకమో..లేక బాబీ డైరెక్షన్‌ మీద నమ్మకమో..తెలియదు కానీ..ఏకంగా రూ. 14.75 కోట్లతో సదరు డిస్ట్రిబ్యూటర్‌ ముందుకు రావడంతో..సినిమాపై అప్పుడే హైప్‌ ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఇది కానీ నిజమైతే..ఇక సీడెడ్‌లో పవన్‌ని ఎన్‌టిఆర్‌ బీట్‌ చేసినట్లే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ